కాపులపైకి కృష్ణయ్యని రెచ్చగొడ్తున్నారు: బొత్స, వంగవీటి రంగా హత్య.. రామకృష్ణపై ఫైర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకు వ్యతిరేకంగా బీసీ సంఘం నేత, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను ఉసిగొల్పుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ గురువారం నాడు ఆరోపించారు.
రాజకీయ లబ్ధి కోసమే కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో గతంలో 26 కులాలను తొలగిస్తే ఆర్ కృష్ణయ్య ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యే రామకృష్ణపై వెలగపూడి ఆగ్రహం
విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పైన తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం నాడు మండిపడ్డారు. కాపు నాయకుడు వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి మూడో ముద్దాయి కాదా అని ప్రశ్నించారు.
వెలగపూడికి దమ్ముంటే రాజీనామా చేయాలని, ఇద్దరం పోటీ చేద్దామని, నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నీవు ఓడిపోతే ఏం చేస్తావని ప్రశ్నించారు. విశాఖను మరో విజయవాడగా చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం, బెల్డు షాపులతో ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications