సమస్యలు చెప్పానని బాబు, ఉండమని బాలకృష్ణ విందు
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన తర్వాత సీమాంధ్రలో సమస్యలను తాను కేంద్రమంత్రులకు వివరించాలనని ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్‌తో భేటీ అయ్యారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. విభజన తర్వాత సీమాంధ్రలోని సమస్యలను వివరించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై చర్చించామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు ప్రోత్సాహకాల అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను త్వరగా ప్రకటించాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
హిందూపురం నేతలకు బాలయ్య విందు
హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ గురువారం తన నియోజకవర్గం నేతలకు విందు ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేద్దామన్నారు. మహానాడు సందర్భంగా వచ్చిన హిందుపురం నియోజకవర్గ నేతలను ఒకరోజు ఉండాలని ముందే చెప్పిన బాలయ్య వారికి విందు ఇచ్చారు.












Click it and Unblock the Notifications