పనికిమాలిన లాయర్‌తో: బాబు ఫైర్, టిపై చర్చించాలని..

Chandrababu Naidu
న్యూఢిల్లీ: బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుతో ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం పనికిమాలిన న్యాయవాదిని పెట్టి పసలేని వాదన వినిపించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం మండిపడ్డారు. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుతో పాటు తెలంగాణ అంశం పైన ఆయనతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

కృష్ణా నీటిపై రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తాము ప్రణబ్‌కు వివరించామన్నారు. రాష్ట్ర ప్రజల జీవనం కృష్ణా జలాలతో ముడివడి ఉందన్నారు. పద్నాలుగు జిల్లాలు కృష్ణా నీటిపై ఆధారపడి ఉన్నాయని, హైదరాబాదుకు తాగు నీరు లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం సరైన వాదనలను వినిపించలేకపోయిందన్నారు. వాదన సరిగా జరగనంత మాత్రాన రాష్ట్రానికి అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు.

ఏ ప్రాజెక్టు కట్టినా గతంలో 75 శాతం నీటిని ప్రామాణికంగా తీసుకున్నారని, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 65 శాతం నీటి లభ్యత ఆధారంగా జలాలు కేటాయించారన్నారు. నీటి లభ్యత డేటా ఉన్నంత వరకే పరిగణలోకి తీసుకోవాలన్నారు. ట్రైబ్యునల్ తీర్పుతో ఎపికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రపతికి తాము ఎనిమిది పేజీల నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. తీర్పు ఏకపక్షంగా ఉందని అందులో పేర్కొన్నామన్నారు.

ట్రైబ్యునల్ ఫార్సుగా మారిందని, రాష్ట్ర హక్కులను కాలరాసిందని ధ్వజమెత్తారు. అల్మట్టి డ్యామ్ పెంచొద్దని చెప్పారే గానీ సరైన వాదనలు ప్రభుత్వం వినిపించలేకపోయిందన్నారు. అదనపు కేటాయింపుల వల్ల కర్నాటకలో ప్రాజెక్టులు కడితే దిగువకు నీరు అందదని, జల విద్యుత్ ఆగిపోతుందని, పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణపై..

రాష్ట్ర విభజన పైన కూడా చంద్రబాబు రాష్ట్రపతితో చర్చించారు. అందరిని మరోసారి సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ఆయనను కోరారు.

జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్‌ను కూడా చంద్రబాబు కలిశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను రద్దు చేసి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు చంద్రబాబు భేటీ తర్వాత మీడియాతో చెప్పారు. ఆ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారని, అయితే కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నట్లు తెలిపారు. ఆల్మట్టి ఎత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది టిఎంసిల నీరు కూడా రాదని ఆయన అన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.

బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర జలవనరుల సంఘం (సిడబ్ల్యుసి)ని బ్రిజేష్ ట్రిబ్యునల్ అతిక్రమించిందని ఆయన విమర్శించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించిన సుదర్శన్ రెడ్డి అసమర్థుడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+