అక్కడ కొత్త ఇంచార్జులు, ఇద్దరిపై బాబు వేటు!: శివప్రసాద్‌కు ఒక్క ఛాన్స్

చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌పై చర్యలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపక్రమించినట్లుగా కనిపిస్తోంది. శివప్రసాద్‌తో పాటు మరో నేతపై కూడా వేటు వేయాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది.

విజయవాడ: చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌పై చర్యలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపక్రమించినట్లుగా కనిపిస్తోంది. శివప్రసాద్‌తో పాటు మరో నేతపై కూడా వేటు వేయాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నేతలతో తేల్చి చెప్పారని తెలుస్తోంది.

చదవండి: బొజ్జల ఎఫెక్ట్, 2019 భయం: బాబుపై శివప్రసాద్ ఆగ్రహం వెనుక మరో కోణం

వేటు పడనున్న వ్యక్తుల్లో శివప్రసాద్‌తో పాటు చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న ఆ మరో ముఖ్య నేత ఎవరనే చర్చ సాగింది. మొత్తానికి ఇద్దరిపై వేటు వేయాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో ఆ మరో నేత ఎవరు అనే సస్పెన్స్ టిడిపిలో కనిపిస్తోంది. శివప్రసాద్‌పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పారనని తెలుస్తోంది.

లోకసభ ఇంచార్జులుగా కొత్త వారు

లోకసభ ఇంచార్జులుగా కొత్త వారు

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో జిల్లాల ఇంచార్జి మంత్రులూ మారతారని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రుల్లో కొందరు జిల్లాలకు ఇంచార్జి మంత్రులుగానూ, లోకసభ నియోజకవర్గాలకు ఇంచార్జిలుగాను నియమిస్తామని చంద్రబాబు ఆదివారం నేతలతో చెప్పారు.

సొంత జిల్లా, సొంత లోకసభ నియోజకవర్గాలు తప్ప మిగతా జిల్లాలు, లోకసభ నియోజకవర్గాల్లో ఎక్కడ ఇంచార్జులుగా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నారో మంత్రులు సూచించాలని, దాన్ని పరిశీలించి నిర్ణయిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజల్లో 80 శాతం తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చేలా మంత్రులు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని వెళ్లాలని సీనియర్ నేతలకు, పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

శివప్రసాద్‌కు మరో ఛాన్స్

శివప్రసాద్‌కు మరో ఛాన్స్

శివప్రసాద్ పైన వేటు వేయనున్నానని చంద్రబాబు చెప్పడంతో కేంద్రమంత్రి సుజనా చౌదరి, మంత్రి అమర్నాథ్ రెడ్డిలు అధినేతకు సర్ది చెప్పారని తెలుస్తోంది. ఆయనకు మరో అవకాశమివ్వాలని, ఓసారి మాట్లాడుదామని చెప్పారు. దీంతో శివప్రసాద్‌తో మాట్లాడే బాధ్యతను సుజన, అమర్నాథ్ రెడ్డికి అప్పగించారు. వారు ఆదివారం శివప్రసాద్‌తో మాట్లాడారని తెలుస్తోంది.

శివప్రసాద్ వర్సెస్ చంద్రబాబు

శివప్రసాద్ వర్సెస్ చంద్రబాబు

రెండు రోజులుగా ఎంపీ శివప్రసాద్ సీఎం చంద్రబాబుపై మండిపడుతున్న విషయం తెలిసిందే. దళితులకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని, ఢిల్లీ వచ్చినప్పుడు చంద్రబాబు ఎంపీలకు సమయం కేటాయించడం లేదని, తాను కుప్పం ఓట్లతో గెలవలేదని, చిత్తూరు నుంచి తాను రెండుసార్లు ఎంపీగా గెలిచానని, టిడిపి ఎమ్మెల్యేలు ఓడిన అయిదు చోట్ల ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల కంటే తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, తనకు పలుకుబడి ఉందని శివప్రసాద్ అన్నారు.

ఎప్పటికీ చిత్తూరు ఎంపీని తానేనని చెప్పిన శివప్రసాద్, ఏ పార్టీ నుంచో చెప్పే విషయాన్ని మాత్రం దాటవేశారు.

చంద్రబాబు ఘాటుగా..

చంద్రబాబు ఘాటుగా..

చంద్రబాబు కూడా అంతే ఘాటుగా స్పందించారు. కట్టుతప్పుతున్న నేతలపై వేటు తప్పదని హెచ్చరించారు. ఆరు నెలలుగా శివప్రసాద్ పార్టీ సమావేశాలకు రావడం లేదని, శివప్రసాద్ చెప్పిన పని చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయని, ఆయన చెప్పినవి చేయడం కుదరదని ముందే చెప్పానని చంద్రబాబు అన్నారు. నేతలను హెచ్చరించి వదిలేస్తే అలుసుగా తీసుకుంటున్నారని, చర్యలు తప్పవన్నారు.

వివరణ ఇచ్చేందుకు చంద్రబాబును కలుస్తారా?

వివరణ ఇచ్చేందుకు చంద్రబాబును కలుస్తారా?

చంద్రబాబుపై, టిడిపిపై విమర్శలు చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చంద్రబాబును కలిసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసీ.. ఆ తర్వాత కూడా ఆయన ఒకింత గట్టిగనే మాట్లాడారు.

ముక్కుసూటిగా..

ముక్కుసూటిగా..

అయితే తాను ఏం తప్పు మాట్లాడానని, ముక్కుసూటిగా మాట్లాడుతున్నానని చెప్పారు. కాగా, తన వ్యాఖ్యలపై వివరణ ఇఛ్చేందుకు ఆయన చంద్రబాబును కలిసే అవకాశముందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+