చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొజ్జల ఎఫెక్ట్, 2019 భయం: బాబుపై శివప్రసాద్ ఆగ్రహం వెనుక మరో కోణం

చిత్తూరు తెలుగుదేశం పార్టీలో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డిని చంద్రబాబును పక్కన పెట్టారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు తెలుగుదేశం పార్టీలో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డిని చంద్రబాబును పక్కన పెట్టారు. ఆ తర్వాత మరో సీనియర్ నేత ఎంపీ శివప్రసాద్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు.

చంద్రబాబుపై శివప్రసాద్ నిప్పులు: తెర వెనక జరిగిన కథ ఇది! టీడీపీలో కలవరం చంద్రబాబుపై శివప్రసాద్ నిప్పులు: తెర వెనక జరిగిన కథ ఇది! టీడీపీలో కలవరం

శివప్రసాద్ ఆగ్రహం వెనుక మరో కోణం ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు తనకు టిక్కెట్ ఇస్తారా? యువతకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో తదుపరి ఎన్నికల్లో తన సీటుకు ఎసరు పడుతుందా? అనే ఆందోళన కూడా శివప్రసాద్‌లో ఉందని అంటున్నారు.

బొజ్జలను పక్కన పెట్టినట్లే..

బొజ్జలను పక్కన పెట్టినట్లే..

తన కూతురు పట్ల బొజ్జల వర్గీయులు అనుచితంగా ప్రవర్తిస్తే ఎవరూ పట్టించుకోలేదనే ఆగ్రహం శివప్రసాద్‌లో ఉందనే వార్తలు వచ్చాయి. వాటికి తోడు మరికొన్ని సంఘటనలు ఆయనను కలచివేసి ఉంటాయని అంటున్నారు.

అందులో ఒకటి, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డిని ఇటీవల చంద్రబాబు కేబినెట్ నుంచి తప్పించారు. ఆరోగ్య సమస్యలు చూపించి ఆయనను పక్కన పెట్టారు.

2019 భయం

2019 భయం

జగన్‌కు, పవన్ కళ్యాణ్‌కు చెక్ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా చంద్రబాబు యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ రోజు బొజ్జలకు ప్రాధాన్యత తగ్గినట్లే, రేపు ఎన్నికల్లో తనకూ చెక్ చెప్పినా చెప్పవచ్చుననే ఆవేదన శివప్రసాద్‌లో ఉందని అంటున్నారు.

ఈ రోజు బొజ్జలను తప్పించినట్లు, రేపు తనలాంటి సీనియర్ నేతలను కూడా కరివేపాకులా వాడుకుంటారని ఆవేదన చెందుతున్నారంటున్నారు.

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు

మరో విషయం, తన భూముల వ్యవహారంలో కలెక్టర్ పైన తాను ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధిష్టానం పట్టించుకోలేదని శివప్రసాద్ ఆవేదనగా ఉన్నారని తెలుస్తోంది. అధికారులను బదలీ చేయాలన్నా పట్టించుకోలేదని అంటున్నారు.

దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. అధిష్టానం తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదని సన్నిహితులతో ఆవేదన చెందుతున్నారట. కలెక్టర్‌పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన చెందుతున్నారని అంటున్నారు.

మంత్రి ఎదుటే విమర్శలు

మంత్రి ఎదుటే విమర్శలు

ఆయన మంత్రి అమర్నాథ్ రెడ్డి ముందే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో శ్రీకృష్ణదేవరాయులు, రాజకీయాల్లో చాణక్యుడిని ఆదర్శంగా తీసుకుంటామని చెబుతారని, కానీ దళితుల అభ్యున్నతికి పాటుపడిన అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలకు హాజరుకాకుండా దళితులను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో భూసేకరణ పేరిట దళితుల భూములు తీసుకుని ప్రభుత్వం వారిని కూలీలుగా మారుస్తోందని విమర్శించారు.

English summary
Another angle behind Telugudesam Party MP Sivaprasad unhappy with Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X