Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన!
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరుస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు కలగడంతో ఆగ్నేయాసియా దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా ముడిచమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకడంతో వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలు తమ ఉద్యోగులను తిరిగి 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) చేయాల్సిందిగా ఆదేశించాయి. వియత్నాంలో గ్యాసోలిన్ ధరలు 32 శాతం, డీజిల్ ధరలు 56 శాతం పెరగడంతో రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇంటి నుంచే పని చేయడం ఒక్కటే మార్గమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. థాయ్‌లాండ్‌లో సైతం కేవలం 95 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉండటంతో, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రయాణాలు తగ్గించి విద్యుత్ ఆదా చేయాలని ప్రధాని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఇప్పుడు భారత ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరులపై కూడా పడుతోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా భారతదేశానికి రావాల్సిన ఎల్‌పీజీ (LPG) సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మన దేశ అవసరాల్లో దాదాపు 67 శాతం దిగుమతులపైనే ఆధారపడటం, అందులోనూ సింహభాగం హార్ముజ్ జలసంధి ద్వారానే రావాల్సి ఉండటంతో ప్రస్తుతం సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మళ్లీ ఇంటి నుండే పని చేసే అవకాశం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇంటి వద్దే ఉంటే ఇంధనం ఆదా..
వెల్స్ ఫార్గో వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ కట్టాకం వంటి కార్పొరేట్ దిగ్గజాలు లింక్డ్‌ఇన్ వేదికగా చేసిన సూచనలు ఇప్పుడు ఐటీ కారిడార్లలో హాట్ టాపిక్‌గా మారాయి. వేలాది మంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి వాడే ఇంధనాన్ని ఆదా చేసి, దానిని అత్యవసర సేవలకు మళ్లించడం ప్రస్తుతం ఒక సామాజిక బాధ్యతగా (CSR) మారాలని ఆయన పిలుపునిచ్చారు.
అప్రమత్తమైన కేంద్రం..
మరోవైపు, ఇంధన కొరత కారణంగా దేశీయ వాణిజ్య రంగం విలవిలలాడుతోంది. గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగి, ముంబైలో 20 శాతం హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. బెంగళూరు, చెన్నైలలోని రెస్టారెంట్లు తమ పని వేళలను కుదించుకుంటున్నాయి. విమాన ఇంధనం (Jet Fuel) ధరలు పెరగడం వల్ల విమాన టిక్కెట్ల ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలులోకి తెచ్చినప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధనాన్ని తెప్పించుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఇంధన డిమాండ్‌ను తగ్గించాలంటే ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడమే సరైన మార్గమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పనికి కట్టుబడి ఉంటేనే ...
అయితే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు ఇంటి వద్దే ఉండి పనికి కట్టుబడి ఉంటేనే ఇంధన పొదుపు సాధ్యమవుతుందని కొందరు వాదిస్తుండగా, ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం భారతదేశం వద్ద 25 నుంచి 30 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే మాత్రం మళ్లీ కరోనా కాలం నాటి 'వర్క్ ఫ్రెమ్ హోమ్' రోజులు రావడం ఖాయమనిపిస్తోంది. ఐటీ కారిడార్లలోని కాఫీ షాపుల నుంచి బోర్డ్ రూమ్‌ల వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంధన సెగలు, ఇంటి నుంచి పని గురించిన గుసగుసలే వినిపిస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications