Dhurandhar 2 First Review: బ్లడ్ బాత్.. పాకిస్థాన్ కు పిండం పెట్టాడుగా..!!

రణ్ వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ధురంధర్'.. బాక్సాఫీస్ ను ఈ మూవీ చెడుగుడు ఆడుకుంది. దేశభక్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ వసూళ్ల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి కొనసాగింపుగా 'ధురంధర్ ది రివేంజ్' మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దాంతో మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ను కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు.

అయితే ఫస్ట్ పార్ట్ కు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని 'ధురంధర్ ది రివేంజ్' మూవీని హిందీతోపాటుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళలోనూ రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజై దాదాపు 45 దేశాల్లో ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం. ట్రైలర్ రిలీజైన కేవలం 48 గంటల్లోనే దాదాపు 312 మిలియన్ల వ్యూస్ ను అధిగమించి ఇండియన్ మూవీ హిస్టరీలోనే సంచలన రికార్డును నమోదు చేసింది.

ఇక 'ధురంధర్ ది రివేంజ్' మూవీ రన్ టైమ్ దాదాపు 4 గంటలు ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ కూడా దాదాపు 3 గంటలకు పైగా ఉంది. ఇక మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైన ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ అలాగే హమ్జా అనే రెండు పవర్‌ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ కు మించిన యాక్షన్, ఎమోషన్స్‌ ఈ మూవీలో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

Dhurandhar The Revenge Movie First Review Out now Explosive Action amp amp Deeper Emotions Beat Part 1

ఈ స్పై యాక్షన్ మూవీలో రణ్ వీర్ సింగ్ తోపాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ దాదాపు రూ. 1400 కోట్లు కలెక్ట్ చేయగా సెకండ్ పార్ట్ ఈజీగా రూ. 2వేల కోట్ల మార్కును అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి 'ధురంధర్ ది రివేంజ్' మూవీ రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులను అధిగమిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+