హార్ముజ్ పై చేతులెత్తేసిన అమెరికా..! చమురు మార్కెట్లకు బిగ్ షాక్..!
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులు ఎప్పుడు ముగుస్తాయో తెలియని పరిస్ధితి. వీటికి ప్రతిగా ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడులు సైతం గల్ఫ్ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో అమెరికా ఇప్పుడు ఇరాన్ పై పూర్తి స్ధాయిలో సర్వశక్తులొడ్డాల్సిన పరిస్ధితి వచ్చేసింది. అది ఏ స్ధాయిలో అంటే ఇరాన్ పై చేస్తున్న దాడుల్లో బిజీగా ఉన్న అమెరికా సైన్యం.. పక్కనే హార్ముజ్ జల సంధిలో చమురు నౌకలకు ఎస్కార్ట్ కల్పించే విషయంలో చేతులెత్తేసేంతగా..
ఇరాన్ యుద్దం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో చమురు నౌకల భద్రత గాల్లో దీపంగా మారిపోయింది. ఈ మార్గంలో వెళ్లే అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ నౌకల్ని టార్గెట్ చేస్తామని చెప్పి మరీ దాడులు చేస్తున్న ఇరాన్ ను అడ్డుకునే విషయంలో ట్రంప్ కు ఓ ప్రణాళిక అంటూ లేకుండా పోతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లు పెట్టి మరీ నౌకల్ని పేల్చేస్తున్న ఇరాన్ కు అడ్డుకట్ట వేస్తామని ట్రంప్ ప్రకటించిన రెండు రోజుల్లోనే అమెరికా ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసింది.

ఇరాన్ వార్ లో బిజీగా ఉన్న తమ సైన్యం (US military)హార్ముజ్ జల సంధిలో చమురు నౌకలకు ఎస్కార్ట్ కల్పించలేకపోతోందని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు ట్యాంకర్లకు తమ నేవీ ఎస్కార్ట్‌లను, షిప్పింగ్ కంపెనీలకు రీఇన్స్యూరెన్స్ సౌకర్యాలను అందించడం ద్వారా మార్కెట్లను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఎస్కార్ట్‌లు ఇవ్వలేదు. అయితే ప్రస్తుతానికి ఎస్కార్ట్ లు ఇవ్వలేమని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి తేల్చిచెప్పేశారు. దీంతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications