అధికారుల్ని వణికించిన బుడతలు! కలెక్టరేట్‌ను ముట్టడించిన 'జెన్ ఆల్ఫా'
చదువుకోవాల్సిన వయసులో, బడికి వెళ్లాల్సిన దారి బురదమయంగా మారి నరకం చూపిస్తుంటే ఆ పసి హృదయాలు సహించలేకపోయాయి. ఉత్తరప్రదేశ్ నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల చిన్న పిల్లలు తమ హక్కుల సాధన కోసం క్లాస్‌రూమ్‌లను వీడి నేరుగా కలెక్టరేట్ బాట పట్టారు. చేతిలో జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ 'జెన్ ఆల్ఫా' తరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హమీర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. చిన్న పిల్లలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ధర్నాకు దిగడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

यह यूपी का हमीरपुर जिला है स्कूल तक पक्की सड़क बनवाने के लिए जेन अल्फा बच्चों ने कलेक्ट्रेट घेर लिया है। देश अब रुकने वाला नहीं है।
— Awesh Tiwari (@awesh29) August 11, 2026
मुझे नाना पाटेकर की फिल्म प्रहार का आखिरी दृश्य नजर आता है जहां सेना के एक अफसर को बतौर सिविलियन सिस्टम का शिकार होना पड़ता है। अंतिम दृश्य में… pic.twitter.com/pvuXaKPxdg
వానొస్తే బడి బంద్.. ప్రాణాపాయంలో ఊరు!
హమీర్‌పూర్ జిల్లా కురారా బ్లాక్ పరిధిలోని చందుపూర్ గ్రామ పంచాయతీకి చెందిన పలు పల్లెల విద్యార్థులు ఈ వినూత్న నిరసనలో పాల్గొన్నారు. దాదాపు 3,000 జనాభా ఉన్న ఈ ప్రాంతంలో బడికి వెళ్లేందుకు సరైన పక్కా రోడ్డు లేక కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారి మొత్తం బురద గుంటగా మారిపోతుందని, బడికి వెళ్లడమే కాకుండా అత్యవసర వేళల్లో రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం కూడా గగనమైపోతోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అటవీ శాఖ మూసివేయడంతో తమకు మిగిలిన ఏకైక దారి పూర్తిగా ధ్వంసమైందని ఆరోపించారు.
తాత్కాలిక పూడ్చివేతలతో మోసం.. తిరగబడ్డ పసిహృదయాలు
విద్యార్థులు ఇలా కలెక్టర్ ఆఫీస్ ముందుకు రావడం ఇది మొదటిసారేమీ కాదు. జూలై 3న కూడా వీరు నిరసన తెలపగా, అధికారులు మట్టి పోసి చేతులు దులుపుకున్నారు. అయితే, మళ్లీ వర్షాలు పడటంతో ఆ మట్టి కాస్తా మరింత భయంకరమైన బురదగా మారింది. శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక పూడ్చివేతలతో కాలయాపన చేస్తుండటంతో విసిగిపోయిన పిల్లలు, నేరుగా కలెక్టర్ వద్దకే తేల్చుకుందామని ఊరేగింపుగా బయలుదేరారు.
పోలీసుల అడ్డంకులు దాటుకుని సరిహద్దు గేటు వద్ద బైఠాయింపు
జాతీయ జెండాలు ఏకధాటిగా పట్టుకుని వస్తున్న చిన్నారుల ఊరేగింపును అడ్డుకునేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభిషేక్ కుమార్, సర్కిల్ ఆఫీసర్ యశ్‌పాల్ సింగ్ భారీ పోలీస్ బలగాలతో రంగాంలోకి దిగారు. కానీ అధికారుల అడ్డంకులను సైతం లెక్కచేయకుండా ముందుకెళ్లిన విద్యార్థులు, చివరికి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. తమకు పక్కా రోడ్డు నిర్మించే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఫతేపూర్ జిల్లాలోనూ పాఠశాల విద్యార్థులు ఇలాగే పోరాడి విజయం సాధించగా, ఇప్పుడు హమీర్‌పూర్ చిన్నారులు కూడా పక్కా రోడ్డు కోసం వీరోచిత పోరాటం చేయడం విశేషం.














Click it and Unblock the Notifications