మునగాకు రోటి పచ్చడి.. ఇలా చేస్తే మీకు బాగా నచ్చుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది!
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆకుకూరల్లో, వంద రోగాలను నయం చేయగల గొప్ప గుణాలున్న మునగాకు ఒకటి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకులో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చాలామంది మునగాకును పొడి చేసి తింటారు కానీ పల్లెటూరి స్టైల్‌లో రోటీ పచ్చడి చేస్తే రుచి అదిరిపోతుంది. రోటీ లేదా అన్నంతో కలిపి తింటే మునగాకు పచ్చడి చాలా బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు:
లేత మునగాకు - 2 కప్పులు,
నువ్వులు - అర కప్పు,
ధనియాలు - 1 టీస్పూన్,
పచ్చిమిరపకాయలు - 10
టమాటా ముక్కలు - 1 కప్పు,
చింతపండు - నిమ్మకాయ సైజు,
వెల్లుల్లి రెబ్బలు - 6
జీలకర్ర - అర టీస్పూన్,
ఉప్పు- రుచికి తగినంత
నూనె - 1½ టేబుల్‌స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:
ముందుగా కడాయిలో నువ్వులు, ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్‌లో చిటపటలాడే వరకు వేయించి చల్లార్చండి. అదే కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి తీసుకోండి. తర్వాత మునగాకును పచ్చి వాసన పోయే వరకు వేయించండి. టమాటా ముక్కలు, చింతపండు వేసి మగ్గే వరకు ఉడికించి చల్లార్చండి.
ఇలా చేస్తే మునగాకు పచ్చడి బాగుంటుంది
ఇప్పుడు రోట్లో వేయించిన నువ్వులు, కరివేపాకు, పచ్చిమిర్చి, మునగాకు, టమాటా-చింతపండు మిశ్రమం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా దంచండి. పచ్చడి తయారైనాక వేరే గిన్నెలోకి తీసుకోండి. పోపు కోసం చిన్న పాన్‌లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి వేయించి చివరగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పోపును పచ్చడి పేస్ట్‌లో కలపండి.
అన్నం, రోటీ ఏదైనా సరే సూపర్ టేస్ట్
అంతే.. ఎంతో రుచికరమైన, ఎన్నో పోషక విలువలు ఉన్న మునగాకు రోటీ పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడి రోటీ, అన్నం, దోసెతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యంతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఇలా మునగాకు పచ్చడి తయారు చేయటాన్ని ప్రయత్నించి చూడండి.దీని రుచి మీకూ నచ్చుతుంది. ఇది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.













Click it and Unblock the Notifications
