నిరుద్యోగులకు బిగ్ అప్డేట్.. సిలబస్ మార్పుపై TGPSC కీలక ప్రకటన
తెలంగాణలోని నిరుద్యోగులకు బిగ్ అప్డేట్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ మార్పుపై క్లారిటీ వచ్చింది. TGPSC సిలబస్ ను సవరణపై వస్తున్న విజ్ఞప్తులు, అభ్యర్థనల నేపథ్యంలో తాజాగా కమిషన్ ఓ వెబ్ నోట్ ను విడుదల చేసింది. సిలబస్ మార్పులపై అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. సిలబస్ మార్పులకు సంబంధించి ఏడాది ముందుగానే అభ్యర్థులకు సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు సిలబస్ మార్పుపై TGPSC ఎలాంటి సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని వెల్లడించింది. ఇక సిలబస్ లో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటే సంబంధిత నియామక నోటిఫికేషన్ తో పాటు కొత్త సిలబస్ ను విడుదల చేస్తామని పేర్కొంది. ఈ క్రమంలో సిలబస్ మార్పులపై అభ్యర్థులు అనవసరంగా ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని వెబ్ నోట్ ద్వారా స్పష్టం చేసింది.
ఇక TGPSC నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి అందరికీ కామన్ గా ఉండే పేపర్ 1 లో పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పాత సిలబస్ లో మొత్తం 11 అంశాలు ఉండగా.. వాటిని కాస్త పెంచి కొత్త సిలబస్లో 15 అంశాలకు తీసుకొచ్చారు. ఈ మేరకు ఎకానమీ, పాలిటీ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ డెమోగ్రఫీ అలాగే మోడ్రన్ ఇండియన్ హిస్టరీ వంటి అంశాలను పొందుపరిచారు. మరోవైపు ప్రస్తుతం టీజీపీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది.

ఇటీవల హైదరాబాద్ జలమండలిలో 130 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు తేదీలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17 వరకు ఉన్నాయి. అలాగే రానున్న కాలంలో ఆర్థిక శాఖ నుంచి సుమారు 3,800 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తులు చేస్తోంది. వీటిల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, టౌన్ ప్లానింగ్ అధికారులు, స్టాటిస్టికల్ అండ్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు మరో రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
