చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్... గిన్నిస్ రికార్డ్స్‌లోకి రాకా!

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటుడిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. పుష్పతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న బన్నీ.. తాజాగా మరో ఘనత సాధించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాకా మూవీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

Allu Arjun s Raaka Creates Guinness World Record With 37 People in Real-Time Motion Capture

పురాణాలు, ఆధునిక సాంకేతిక ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ రాకా. కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. జాన్వీకపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్‌, రమ్య కృష్ణన్, జిమ్ సర్బా, అర్షద్ వార్సి, యోగి బాబు, చెంబన్ వినోద్ జోస్, ఫెమినా జార్జ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్, అట్లీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తుండగా.. జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా, ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు హాలీవుడ్ నిపుణులు, స్టూడియోలు రాకా కోసం పనిచేస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్‌తో రాకాను నిర్మిస్తున్నారు. మూడు కాలాల నేపథ్యంలో రాకా ఉంటుందని.. ఇందులో వింతైన జంతువులు, జీవులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. రాకా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ .. హాలీవుడ్ ఐకానిక్ మూవీ అవతార్‌ను మించి ఉంటాయంటూ దర్శకుడు శిబి చక్రవర్తి వ్యాఖ్యానించడంతో సినిమాపై అంచనాలు మించిపోయాయి. దాంతో ఈ ప్రచారంపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. రాకా యూనిట్ ఎప్పుడూ ఈ సినిమాను మరో గొప్ప సినిమాతో పోల్చలేదు. రాకా కథపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.

విడుదలకు ముందే రాకా సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో రాకా స్థానం సంపాదించి అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా కోసం మేకర్స్ అత్యున్నత మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడుతున్నారు. రాకా కోసం దాదాపు 37 మంది నటీనటుల హావభావాలను, ముఖ కవళికలను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించి రియల్ టైమ్‌లో చిత్రీకరించారు. ఇందుకు గాను రాకాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు.. అల్లు అర్జున్, అట్లీలకు అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

గిన్నిస్ బుక్‌లోకి స్థానం సంపాదించడంతో రాకాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ ఘనత సాధించినందున అల్లు అర్జున్‌తో పాటు చిత్ర యూనిట్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది రాకా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+