Dhanush: ధనుష్ మరో అడుగు - ఫ్యాన్స్ అసోసియేషన్ కీలక ప్రకటన..!
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్ని సొమ్ము చేసుకునేందుకు హీరో ధనుష్ (Dhanush) ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయ్ తరహాలోనే తాను కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై వరుస సంకేతాలు ఇస్తున్న ధనుష్.. ఇవాళ అభిమాన సంఘం ద్వారా మరో సంకేతం ఇప్పించారు. దీంతో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై తమిళనాడులో చర్చ జోరందుకుంది.
తమిళనాడులో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ తన అభిమాన సంఘాలకు ధనుష్ పిలుపునిచ్చారు. దీంతో త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందన్న ప్రచారం మొదలైంది. దీనికి కొనసాగింపుగా ఇవాళ ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ కోయంబత్తూరు జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ధనుష్ అభిమాన సంఘం జాతీయ కార్యదర్శి బి. రాజా సోషల్ మీడియాలో ఇచ్చిన పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

తమిళనాడులో గతంలో అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకుని, తద్వారా క్షేత్రస్దాయిలో బలమైన ఓటు బ్యాంకు పెంచుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన సినీ పరిశ్రమ హీరోలు, నటీనటులు చాలా మందే ఉన్నారు. ఇదే కోవలో తాజాగా హీరో విజయ్ కూడా రెండేళ్ల క్రితం ఇలాగే సంక్షేమ సంఘాల సాయంతో ఎంట్రీ ఇచ్చి జనంలోకి దూసుకెళ్లడమే కాకుండా ఎవరూ ఊహించని రీతిలో సీఎం కూడా అయ్యారు. దీంతో విజయ్ తరహానే తాము కూడా అదృష్టం పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే ధనుష్ తో పాటు మరో హీరో విశాల్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications