ధారవి రీడెవలప్‌మెంట్ ఆపరేషన్: నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేతపై అధికారుల స్పష్టత!

ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టు పరిధిలోని గణేష్ నగర్ - మేఘవాడి ప్రాంతంలో ఈ నెల ఆగస్టు 6న చేపట్టిన ఇళ్ల తొలగింపు ప్రక్రియపై అధికారులు కీలక స్పష్టత ఇచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేశారంటూ వస్తున్న ఆరోపణలను డీఆర్‌పీ యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలన్నీ పూర్తిగా చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని తెలిపింది. బాధితులకు తగినంత సమయం ఇవ్వడంతో పాటు, స్వచ్ఛందంగా పునరావాసానికి మారేందుకు అన్ని అవకాశాలు కల్పించామని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఏప్రిల్ నుంచే నోటీసులు..

ప్రాజెక్టు పరిధిలోని సెక్టార్-6 నివాసితులకు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సమగ్ర పబ్లిక్ నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే అద్దె ఒప్పందాలు కుదుర్చుకుని ఇళ్లను ఖాళీ చేయాలని సూచించామని, ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లీగల్ నోటీసులు ఇచ్చామని వివరించారు. స్థానికులు లేవనెత్తిన అభ్యంతరాలపై జులై 6, జులై 13 తేదీల్లో ప్రత్యేక విచారణలు నిర్వహించిన అనంతరమే, జులై 28న కూల్చివేత హెచ్చరిక బోర్డులను ప్రదర్శించామని వెల్లడించారు. మహీమ్, మాతుంగా రైల్వే స్థలాలలో పునరావాస కాలనీల నిర్మాణాన్ని ప్రారంభించడానికి, అత్యంత కీలకమైన రైల్వే రవాణా వ్యవస్థ విస్తరణకే ఈ స్థలాన్ని సేకరించాల్సి వచ్చిందని వివరించారు.

Dharavi Redevelopment Project clarifies due process in Ganesh Nagar Meghwadi rehabilitation and infrastructure works

12 మంది స్వచ్ఛందంగా ఖాళీ.. నలుగురిపైనే పోలీసు చర్య!

సదరు ప్రాంతంలో గుర్తించిన మొత్తం 16 నివాసాలలో 12 మంది యజమానులు అధికారుల కౌన్సెలింగ్‌కు సానుకూలంగా స్పందించి స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేశారు. కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే నిబంధనలకు సహకరించకపోవడంతో, చట్టపరంగా పోలీసుల సాయంతో ఆ ఆక్రమణలను తొలగించాల్సి వచ్చిందని డీఆర్‌పీ తెలిపింది. నివాసాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి అర్హతలతో సంబంధం లేకుండా ఆకర్షణీయమైన అద్దె పరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. గ్రౌండ్ ఫ్లోర్ నివాసితులకు నెలకు రూ. 18,000, పై అంతస్తుల వారికి రూ. 15,000 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ఇల్లు మారే ఖర్చుల కింద ఒకసారి రూ. 5,000తో పాటు ఒక నెల బ్రోకరేజ్ రుసుమును ఇస్తున్నారు. శాశ్వత ఇల్లు కేటాయించే వరకు ప్రతి ఏటా అద్దెను 5 శాతం చొప్పున పెంచుతూ పోతారు.

ముందుగానే ఏడాది అద్దె.. బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ!

ఇంకా అర్హత ఖరారు కాని నివాసితుల కోసం ప్రత్యేక వెరిఫికేషన్ ప్రక్రియ అందుబాటులో ఉందని, వీరికి కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఏడాది అద్దెను అడ్వాన్స్‌గా ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు. నిబంధనల ప్రకారం అద్దె ఒప్పందం చేసుకోగానే 3 నెలల అద్దెను, ఇల్లు ఖాళీ చేసి అప్పగించాక మిగిలిన 9 నెలల అద్దెను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. చట్టపరమైన నోటీసులు ఇచ్చినా సహకరించని వారు నిబంధనల ప్రకారం పునరావాస ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందంటూ డీఆర్‌పీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తహశీల్దార్ స్పష్టం చేశారు. స్థానిక ప్రజల హక్కులను కాపాడుతూ, పారదర్శకంగా, అత్యంత మానవీయ కోణంలో ఈ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+