గోంగూర చికెన్ కర్రీ.. ఇలా చేస్తే అద్భుతః!
మనం నిత్యం అనేక కూరలు వండుకుని తింటాం. అందులో చికెన్ చాలా స్పెషల్. ముఖ్యంగా చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే చికెన్ నార్మల్ గా కాకుండా గోంగూరతో వండుకుని తింటే బాగుంటుంది. చాలా రుచికరమైన, కారంగా ఉండే గోంగూర చికెన్ కర్రీ తయారీ విధానం ఎలాగో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - ½ కిలో (మీడియం పీసులు)
పసుపు - ½ టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 3-4 టేబుల్‌స్పూన్లు
గోంగూర ఆకులు - 2 కట్టలు (శుభ్రం చేసి కడిగినవి)
పచ్చిమిరపకాయలు - 6-8
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
ధనియాల పొడి - 1 టేబుల్‌స్పూన్
కారం పొడి - 2 టేబుల్‌స్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో మూడు స్పూన్స్ నూనె వేసి వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే దాకా వేయించాలి. చికెన్ వేసి బాగా కలిపి అందులో అరస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి, చికెన్ ను సన్న సెగ మీద ఉడికించాలి.
చికెన్, గోంగూర కూర ఇలా చేస్తే టేస్టీ
మరో స్టవ్ మీద గోంగూరను మెత్తగా ఉడికించి, బాగా ఉడికిన చికెన్ లో కలిపి మళ్ళీ కాస్త నీరు పోసి ఉడికించాలి. ఆపై గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి మళ్ళీ ఉడికించాలి. చికెన్, గోంగూర బాగా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చెయ్యాలి. అంతే మీకు ఎంతో నచ్చే చికెన్, గోంగూర రెడీ. అన్నం, రాగి సంగటి, జొన్న రొట్టె లేదా పులావ్‌తో చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి.













Click it and Unblock the Notifications