భారత్ కు ఇరాన్ బిగ్ రిలీఫ్-హార్ముజ్ జలసంధిపై కీలక ప్రకటన..!
ఇరాన్ (iran) పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దం కారణంగా ఆ దేశం కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసేసింది. ప్రపంచ చమురు సరఫరాలో 25 శాతం ఇక్కడి నుంచే జరుగుతోంది. ఇందులో భారత్ (india)కు 50 శాతం ఎల్ఎన్జీ, సీఎన్జీలు హార్ముజ్ జలసంధి నుంచే రవాణా అవుతున్నాయి. దీంతో ఇరాన్ నిర్ణయం భారత చమురు (oil) అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయాలు నెలకున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. ఇతర చమురు దిగుమతి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది.
ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే చమురు నౌకలపై చేస్తున్న దాడుల విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమపై దాడులకు దిగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు వాటికి పరోక్షంగా సాయం చేస్తున్న యూరప్ దేశాల నౌకల్ని మాత్రమే హార్ముజ్ జలసంధి వద్ద అడ్డుకుంటామని, ఇతర దేశాల నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని ఇవాళ ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో భారత్ తో పాటు ఇటువైపు నుంచి చమురు రవాణాపై ఆధారపడ్డ చైనాకూ భారీ ఊరట లభించింది.

యుద్ధ సమయంలో హార్ముజ్ జలసంధి గుండా మార్గాన్ని నియంత్రించే హక్కు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కు ఉందని అంతర్జాతీయ చట్టం, సంబంధిత తీర్మానాలకు అనుగుణంగా ఇప్పటికే స్పష్టం చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్, యూరప్, వారి మద్దతుదారులకు చెందిన ఏవైనా నౌకలు ఈ జలమార్గంలో కనిపిస్తే ఖచ్చితంగా దాడులు జరుగుతాయని హెచ్చరించింది. గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఉమ్మడి సైనిక చర్యను ప్రారంభించినప్పటి నుండి ఈ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఈ చర్య చమురు ధరలను బాగా పెంచింది. దీంతో ప్రపంచ ఆర్దిక వ్యవస్థలపై ప్రభావం పడుతోంది.












Click it and Unblock the Notifications