'ఆ స్టార్ హీరోయిన్ తో RGV పెళ్లి జరిగింది'

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా ఆర్జీవీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ, బాలీవుడ్ నటి ఊర్మిళా మాతోండ్కర్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేశ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఆ సినిమాలో అవకాశం అదృష్టంగా భావిస్తున్నా: సిమ్రాన్ చేతిలో బిగ్ ప్రాజెక్ట్!
ఆ సినిమాలో అవకాశం అదృష్టంగా భావిస్తున్నా: సిమ్రాన్ చేతిలో బిగ్ ప్రాజెక్ట్!

బాలీవుడ్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవల ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్ పాడ్ కాస్ట్‌లో ఈ సంచలన విషయాలను వెల్లడించారు. ఒకసారి చిరంజీవి తనను కలిసినప్పుడు ఈ విషయం గురించి తనతో చెప్పినట్లు తెలిపారు. ఓ జర్నలిస్ట్ గా నువ్వు అన్ని రాస్తావు కానీ ఊర్మిళను రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు రాయలేదని అడిగారట. ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఆలయంలో పెళ్లి జరిగిందని చెబుతూ ఆ వివాహం జరిపించిన పూజరి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారట. ఈ వార్తను ప్రచురించే ముందు ఊర్మిళకు ఫోన్ చేసి అడగగా.. తను ఏడవడం మొదలు పెట్టిందని జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ తెలిపారు. నా గురించి మీరు అలా ఎలా రాస్తారని.. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నా గురించి మీకు తెలుసు కదా అంటూ ఊర్మిళ చెప్పిందట.

Ramgopal Varma Secret Marriage With Urmila Matondkar Journalist Claims Chiranjeevi Revealed It Details

ఇదే విషయంపై రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేసి అడగగా.. దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారట. ఈ క్రమంలో ఆర్జీవీతో.. ఈ వయసులో ఒక నటితో ఇదంతా అవసరమా అని కూడా అడగగా.. ఆర్జీవీ మీతో మాట్లాడాలని లేదని ఫోన్ చేశారని జ్యోతి వెంకటేష్ వెల్లడించారు. వారిద్దరు(ఊర్మిళ, ఆర్జీవీ) విడిపోవడానికి కారణాలను కూడా జ్యోతి వెంకటేష్ వివరించారు. ఊర్మిళ ఆర్జీవీతో లీగల్ గా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని కోరుకుందని, కానీ ఆర్జీవీ దానికి సిద్ధపడకపోవడంతో ఇద్దరూ విడిపోయారని తెలిపారు.

బోల్డ్ సీన్స్‌తో రచ్చ రచ్చ... 'టాక్సిక్’ పై కియారా మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!
బోల్డ్ సీన్స్‌తో రచ్చ రచ్చ... 'టాక్సిక్’ పై కియారా మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. 'గాయం', 'రంగీలా', 'అంతం', 'సత్య' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో రామ్ గోపాల్ వర్మ, ఊర్మిళ కాంబినేషన్ సంచలనం సృష్టించింది. అప్పట్లో ఊర్మిళను ఆర్జీవీ తన డ్రీమ్ గర్ల్ గా భావించేవారు. హిట్ కాంబినేషన్ గా నిలిచిన వీరిద్దరు ఆ తర్వాత మళ్లీ కలిసి పనిచేయకపోవడంపై పలుఊహాగానాలు వచ్చాయి. దీనికి కారణం వారి మధ్య ఉన్న విభేదాలే కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగీ సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఈ కామెంట్లతో ఆ పాత పుకార్లకు బలం చేకూరినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+