థియేటర్ లో ఈ లవ్ స్టోరీ మిస్ అయ్యారా..? OTT లో మాత్రం మిస్ అవ్వొద్దు..

యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ కు ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి మద్దతు ఉంటుంది. అలాగే ఇటీవల థియేటర్లలో ప్రేక్షకులను అలరించి.. మంచి విజయాన్ని అందుకున్న యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీ 'దీవానా' .. ఈ మూవీలో హర్షిత్‌ రెడ్డి, నూతన నటి స్మేహ మణిమేఘలై జంటగా నటించారు. నూతన దర్శకుడు శ్రీకాంత్‌ సంగిశెట్టి దీన్ని తెరకెక్కించారు. వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. జూన్ 20న ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అయింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' సొంతం చేసుకుంది. స్టార్టింగ్ లో ఈ సినిమా 'గోల్డ్' సబ్‌ స్క్రిప్షన్ ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే నేటి నుంచి సాధారణ సబ్‌ స్క్రైబర్లు అందరికీ కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే హాయిగా వీక్షించే అవకాశం ఉంది.

Deewana Did you miss the love story movie Deewana theaters Dont miss it on OTT Deewana ott movie

ఇక దీవానా స్టోరీ విషయానికి వస్తే.. మున్నా(హర్షిత్ రెడ్డి) ఆవారాగా ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతుంటాడు. ఈ క్రమంలో మీసేవ కేంద్రంలో పనిచేసే హీరోయిన్ అమూల్య (స్మేహ మణిమేఘలై)ను చూసి ప్రేమిస్తాడు. అమూల్యను దక్కించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు. మొదట్లో మున్నా ప్రేమను పెద్దగా పట్టించుకోని అమూల్య ఆ తర్వాత మున్నాను లవ్ చేస్తుంది. అయితే మున్నాను ప్రభుత్వ ఉద్యోగం సాధించమని కండీషన్ పెడుతుంది. ఈ లక్ష్యంతో మున్నా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈలోగా కుటుంబ సమస్యలు, ప్రేమలో ట్విస్ట్ కథను మలుపు తిప్పుతాయి. మరి ఈ ప్రేమకథలో ఎలాంటి మలుపులు తిరిగింది..? మున్నా తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..? అనేదే స్టోరీ. ఈ విషయాలు తెలియాలంటే దీవానా మూవీ చూసి తీరాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+