Iran War: ఇరాన్ వార్ లో భారత్ కు తొలి షాక్..! హార్ముజ్ జలసంధిలో..!
నిన్న ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన ఏకపక్ష దాడులు, వాటికి ప్రతీకారంగా ఇరాన్ చేస్తున్న ప్రతిదాడుల్లో చాలా దేశాలు నలిగిపోతున్నాయి. ఇందులో గల్ఫ్ దేశాలతో పాటు భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి ఉపఖండ దేశాలు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రపంచ చమురు సరఫరాలో 20-25 శాతం రవాణా సాగే హార్ముజ్ జలసంధిని (strait of hormuz) ఇరాన్ మూసేసింది. దీంతో ఇందులో ప్రయాణించే భారతీయ నౌకలకు ముప్పు పొంచి ఉందన్న సంకేతాల మధ్య ఇవాళ ఓ దుర్ఘటన చోటు చేసుకుంది.
హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న పలావు దేశ జెండా ఉన్న నౌకను ఇవాళ ఇరాన్ దాడి చేసి ముంచేసింది. సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇవాళ ఈ నౌక హార్ముజ్ జలసంధికి సమీపంలోకి రాగానే ఒమన్ సరిహద్దు సమీపంలోని ముసాండమ్ ద్వీపకల్పం వద్ద ఉన్న ఖసాబ్ పోర్టు దగ్గర ఈ నౌకను ముంచేసింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న 15 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఈ దాడిలో నలుగురు గాయపడినట్లు ఒమన్ తెలిపింది.

⚡️BREAKING
— Iran Observer (@IranObserver0) February 17, 2026
The Iranian Revolutionary Guards fired Anti-Ship Missiles into the Strait of Hormuz
Parts of the Strait are now closed for military activity pic.twitter.com/ZkJuthNLaD
ఇప్పటికే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో అటువైపుగా వెళ్లే నౌకలు ఆలస్యం కావడంతో పాటు చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే భారత్ హార్ముజ్ జలసంధి మీదుగా 50 శాతం ఎల్ ఎన్ జీని రవాణా చేసుకుంటోంది. ఇప్పుడు తాజా పరిణామాల ప్రభావం భారత్ పై మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ యుద్దం మరిన్ని రోజులుగా సాగితే చమురు ధరల మంట తప్పదన్న హెచ్చరికలు వెలువడుతున్నాయి. అయితే భారత్ ఈ పరిణామాలపై ఇప్పటివరకూ స్పందించకుండా మౌనం వహిస్తుండటం విశేషం. కేవలం ఇరాన్ దాడులు చేసిన గల్ఫ్ దేశాలతో మాట్లాడుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ ట్వీట్లు పెడుతున్నారు.
-
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..!












Click it and Unblock the Notifications