ఓటీటీని శాసిస్తున్న 7 థ్రిల్లర్స్ యూట్యూబ్‌లో కూడా ఉచితంగా ఉన్నాయి

వీకెండ్‌ వస్తే చాలు.. థియేటర్లలో ఏ సినిమాలు ఉన్నాయనే దానికంటే ఓటీటీల్లోకి ఏ సరికొత్త కంటెంట్‌ వచ్చిందో అని వెతికేవారు ఎంతోమంది ఉన్నారు. అందులోనూ మైండ్‌ బ్లాక్‌ చేసే సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. భాషతో సంబంధం లేకుండా సబ్‌టైటిల్స్‌తో సహా చూసేస్తుంటారు. చాలామందికి తెలియని విషయమేమిటంటే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అదరగొడుతున్న కొన్ని అత్యుత్తమ థ్రిల్లర్ సినిమాలు యూట్యూబ్‌లో ఉచితంగా లభిస్తున్నాయి. ఈ వీకెండ్‌కు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన ఆ 7 చిత్రాల విశేషాలు ఇవే

1. కుట్రం 23

మెడికల్ క్రైమ్ మాఫియా నేపథ్యంలో వచ్చిన తమిళ బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లలో ఇది ఒకటి. అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో.. చెన్నై నగరంలో కృత్రిమ గర్భధారణ చేయించుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగే వరుస హత్యల కథాంశం ఉంటుంది. ఆ హత్యల వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా ఛేదించాడనేది అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.ఎక్కడ చూడొచ్చు: జీ5 ఓటీటీతో పాటు యూట్యూబ్‌లో 'క్రైమ్ 23' పేరుతో ఉచితంగా అందుబాటులో ఉంది.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ ఫా‍మ్స్ బ్లాక్
కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్‌ ఫా‍మ్స్ బ్లాక్
OTT Buzz 7 Thrillers Dominating Streaming That Are Also Free on YouTube

2. కేడవర్

క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కు మెడికల్ సైన్స్‌ను జోడించి తీసిన పక్కా క్రైమ్ థ్రిల్లర్ ఇది. జైలులో ఉన్న ఒక ఖైదీ తను చేసిన హత్యను ఒప్పుకోవడమే కాకుండా.. రాబోయే రోజుల్లో జరగబోయే హత్యల గురించి ముందే క్లూస్ ఇవ్వడం ఇందులో ప్రధాన ట్విస్ట్. ఈ కేసును ఛేదించే పోలీస్ సర్జన్ భద్ర పాత్రలో అమలాపాల్ నటన ఆకట్టుకుంటుంది.
ఎక్కడ చూడొచ్చు: హాట్‌స్టార్‌తో పాటు యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్ ఉచితంగా లభిస్తుంది.

3. జీవి

ప్రేమలో విఫలమై, పరిస్థితుల ప్రభావంతో ఓనర్ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన ఒక యువకుడి కథతో ఇది ప్రారంభమవుతుంది. తన ఓనర్ జీవితంలో జరిగిన సంఘటనలే తన జీవితంలోనూ పునరావృతమవుతున్నాయని గ్రహించిన హీరో, ఆ కర్మఫలాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేది చాలా విభిన్నమైన పాయింట్‌తో నడుస్తుంది. సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మైండ్ గేమ్ థ్రిల్లర్ ఇది.
ఎక్కడ చూడొచ్చు: జీ5 ఓటీటీతో పాటు యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.

మగాళ్లతో పని లేదు.. ఇద్దరు అమ్మాయిల రొమాంటిక్ మూవీతో ఓటీటీ షేక్ !!
మగాళ్లతో పని లేదు.. ఇద్దరు అమ్మాయిల రొమాంటిక్ మూవీతో ఓటీటీ షేక్ !!

4. 7త్ డే

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. అనుకోకుండా ఇద్దరు కుర్రాళ్లతో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత జరిగే వరుస అనుమానాస్పద సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా చివరి 15 నిమిషాల క్లైమాక్స్ ప్రేక్షకులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది.
ఎక్కడ చూడొచ్చు: హాట్‌స్టార్‌తో పాటు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

5. పతామ్ వలవు

తన కూతురిపై అన్యాయానికి పాల్పడిన ఒక నిందితుడిని చంపి జైలుకు వెళ్లిన తండ్రి, రెండో నిందితుడిని కూడా అంతమొందించడానికి జైలు నుంచి పారిపోతాడు. అతన్ని పట్టుకునే బాధ్యతను ఒక ఎస్.ఐ తీసుకుంటాడు. పగ, ప్రతీకారం, పోలీసు ఇన్వెస్టిగేషన్ల కలబోతగా సాగే భావోద్వేగపూరిత క్రైమ్ థ్రిల్లర్ ఇది.
ఎక్కడ చూడొచ్చు: మనోరమ ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోని 'Ultra Movie Parlour' ఛానెల్‌లో అందుబాటులో ఉంది.

6. ఆపరేషన్ జావా

కేరళ సైబర్ సెల్ విభాగంలో తాత్కాలిక ఉద్యోగులుగా చేరిన ఇద్దరు బీటెక్ నిరుద్యోగుల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. సైబర్ నేరాలను వారు తమ తెలివితేటలతో ఎలా ఛేదించారనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుంది.
ఎక్కడ చూడొచ్చు: జీ5 ఓటీటీతో పాటు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

7. కురంగు బొమ్మై

మాయమైపోయిన తన తండ్రి కోసం వెతికే క్యాబ్ డ్రైవర్‌కు అనుకోకుండా కోతి బొమ్మ ఉన్న ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్‌లో ఉన్నది ఏమిటి? తన తండ్రికి ఏం జరిగింది? అనే విషయాలు తెలుసుకున్నాక హీరో ఏం చేశాడనేది ఈ చిత్ర కథాంశం.
ఎక్కడ చూడొచ్చు: జీ5 ఓటీటీతో పాటు యూట్యూబ్‌లో 'మంకీ బ్యాగ్' పేరుతో అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+