వాట్సాప్‌కు ఆర్టీవో-ఈ చలానా.. ఓపెన్ చేస్తే మీ డబ్బు గోవిందా!

ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు తమకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ప్రజలను నమ్మించి బురిడీ కొట్టించడంలో ఆరితేరిన సైబర్ నేరగాళ్లు పోలీస్ వ్యవస్థకు పెను సవాల్ విసురుతున్నారు. రోజుకో రకమైన స్కామ్ లతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.

విజయవాడలో ఆర్టీవో ఈ చలాన్ పేరుతో పక్కా మోసం

తాజాగా విజయవాడలో ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన whatsapp మెసేజ్ లతో ఆరుగురి బ్యాంకు ఖాతాలను గుల్ల చేశారు. విజయవాడలో ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన వాట్సప్ మెసేజ్ లను ఓపెన్ చెయ్యటంతో ఆరుగురు వ్యక్తుల బ్యాంక్ ఖాతాల నుండి సుమారు 26.97లక్షలు మాయం అయ్యాయి. నకిలీ ఆర్టీవో లింక్ పెట్టి మొబైల్ లను హ్యాక్ చేసి నిలువునా దోపిడీ చేశారు.

Fake RTO e-challan WhatsApp links drain Rs 26 97 lakh from six bank accounts in Vijayawada by cyber criminals

లింక్ లను ఓపెన్ చెయ్యొద్దు అని చెప్పినా సరే వినని జనం

వాట్సప్ ద్వారా వచ్చిన లింక్ లను ఓపెన్ చెయ్యొద్దు అని పదే పదే చెప్పినా సరే ఆ విషయాన్ని విని కూడా మరచిపోతున్న వారు వాట్సప్ లో వచ్చే లింకులు ఓపెన్ చేస్తున్నారు. ఫలితంగా అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇదే తరహాలో వచ్చిన లింక్ లు ఓపెన్ చేసి విజయవాడ క్రీస్తురాజ పురానికి చెందిన కిరణ్ రవాణా శాఖ అధికారి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నారు.

ఆ ఏపీకే ఫైల్ ఓపెన్ చేసి మోసపోయిన విజయవాడవాసులు

జూన్ 6న ఆయన ఫోన్ కు ఆర్టీవో ఈ చలాన్ పేరుతో ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. అది నిజంగానే ఆర్టీవో ఆఫీస్ నుండి వచ్చినదని భావించి ఓపెన్ చేశారు. వెంటనే మొబైల్ హ్యాక్ అయ్యింది. సిమ్ పని చేయటం ఆగిపోయింది. జూన్ 10న కొత్త సిమ్ తీసుకుని 12న యాక్టివేట్ చేయగా ఖాతానుండి లావాదేవీలు జరిగినట్టు, లోన్లు తీసుకున్నట్టు మెసేజ్ లు రావటంతో ఏం జరిగిందో అర్ధం అయ్యింది.

వరద గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాదహెచ్చరిక.. ఆ గ్రామాలకు రాకపోకలు బంద్!
వరద గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాదహెచ్చరిక.. ఆ గ్రామాలకు రాకపోకలు బంద్!

మొత్తం రూ.26.97 లక్షలు మాయం

మూడు క్రెడిట్ కార్డుల నుండి 5 రోజుల్లో 19 ట్రాన్సాక్షన్ లు జరిగినట్టు, రూ.5,69,107 పోయినట్టు గుర్తించారు. అలాగే ఇబ్రహీం పట్నం కు చెందిన గూడవల్లి మురళీ కృష్ణ రూ. 12, 38, 388, పటమటకు చెందిన మురళీకృష్ణ రూ. 90 వేలు, వించిపేటకు చెందిన సయ్యద్ మొహిద్దీన్ రూ. 3,19,805, మాచవరం కు చెందిన ఎం. కిరణ్ రూ.1,80,000, మాధవి రూ. మూడు లక్షలు పోగొట్టుకున్నారు. మొత్తం రూ.26.97 లక్షలు మాయమయ్యాయి. సైబర్ మోసాలపై ఎన్ని సార్లు ప్రజలను అలెర్ట్ చేసినా పదే పదే మోసపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+