మచిలీపట్నం నుంచి కర్నూలుకు కొత్త రైలు-కేంద్రం ఆమోదం- హాల్ట్ లు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలక నగరాలు మచిలీపట్నం, కర్నూలు మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు భారతీయ రైల్వే ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. మచిలీపట్నం నుంచి కర్నూలుకు రాకపోకలు సాగించేలా కొత్త ఎక్స్ ప్రెస్ రైలు (Machilipatnam-Kurnool Express)ను నడపాలని నిర్ణయించింది. ఈ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ రైల్వే విడుదల చేసింది. ఈ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభంతో రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంతో రాయలసీమ ప్రాంతాల రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.

విజయవాడ-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! సెప్టెంబర్ 20న..!
విజయవాడ-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! సెప్టెంబర్ 20న..!

మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య విజయవాడ మీదుగా కొత్త ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. వారానికి 3 రోజుల పాటు ఈ ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ కొత్త మచిలీపట్నం-కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్‌ మొత్తం 499 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు మచిలీపట్నం నుంచి సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 9:30 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9:35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

New Machilipatnam-Kurnool Express to Run Thrice a Week Via Vijayawada
రైల్వే టికెట్లపై యూపీఐ ఛార్జీలు?- అక్టోబర్ 15 నుంచి కొొత్త రూల్..!
రైల్వే టికెట్లపై యూపీఐ ఛార్జీలు?- అక్టోబర్ 15 నుంచి కొొత్త రూల్..!

ఈ మచిలీపట్నం-కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రతీ సోమవారం, బుధవారం, శనివారం నడపనున్నారు. కర్నూలు సిటీ-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైలు ప్రతీ మంగళవారం, గురువారం, ఆదివారం నడుస్తుంది. ఈ రెండు రైళ్లకూ మార్గమధ్యలో గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచర్ల, డోన్‌ స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. ఈ కొత్త సర్వీస్‌తో మచిలీపట్నం, విజయవాడ, కర్నూలు సిటీ మధ్య కనెక్టివిటీ బలోపేతం అవుతుందని రైల్వే శాఖ తెలిపింది. అలాగే మార్గమధ్యంలోని పలు పట్టణాలు, నగరాలకు ప్రయాణికులకు అదనపు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. దీంతో మచిలీపట్నం- కర్నూలు నగరాలతో పాటు మధ్యలో ఉన్న పలు ఇతర పట్టణాలు, నగరాల ప్రయాణికులకు ప్రయోజనం ఉండబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+