కర్నూలు జైలులో జగన్ ను అవమానించారా..? అసలు ఏం జరిగింది..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ కర్నూలు జైలుకు వెళ్లారు. ఓర్వకల్లు ఏయిర్ పోర్టు నుంచి ప్రదర్శనగా కర్నూలు జైలుకు చేరుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శ తరువాత.. జగన్ ఆ సమయంలో జైలు అధికారులు తనను అవమానించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే, అసలు ఏం జరిగిందో జైలు సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు.
మాజీ సీఎం జగన్ పంచలింగాల వద్ద జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన జగన్ జైలులో తనను అవమానించారని చెప్పుకొచ్చారు. ములాఖత్‌కు ఎవరు వచ్చినా, వారిని లోపల కూర్చోబెట్టి ఫోటో తీస్తారని చెప్పారు. అలా ఫోటో తీసిన తర్వాతే లోపలికి పంపిస్తారని... కానీ, తనను అవమానించాలని.. అందరిలా తనను లోపల కూర్చోబెట్టి ఫోటో తీయలేదని చెప్పారు. తనను గ్రిల్ బయట నిలబెట్టించి, గ్రిల్ బయటనే ఫోటో తీశారని చెప్పుకొచ్చారు. మామూలుగా అందరికీ అలాగే చేస్తారా? అని తాను అడిగానని..లేదు సార్ అందరిని మామూలుగా అయితే కూర్చోబెడతాము. మీరు కాబట్టి నిలబెట్టించి ఈ మాదిరిగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు వచ్చాయని సమాధానం ఇచ్చారని జగన్ వివరించారు. జగన్ చెప్పిన ఈ అంశాలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

జైలు సూపరింటెండెంట్ వివరణ
కాగా, జగన్ చేసిన ఈ ఆరోపణల పైన కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫొటోను తీసుకొని ములాఖత్‌కు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. ములాఖత్ సమయంలో అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం హోదాకు భంగం కలిగించలేదని వెల్లడించారు. ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరని తెలిపారు. ఆయన ఫొటో కూడా అలాగే తీసుకున్నా మని వెల్లడించారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములను కలుస్తానని జగన్ కోరారని తెలిపారు. ఈ- ప్రిజన్స్ సాఫ్ట్‌వేర్ ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలుస్తానం టే అన్నిసార్లు ఫొటో తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే మాజీ సీఎం జగన్ ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు. ఏ అధికారి, సిబ్బంది జగన్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications