ప్రసాదంలో మత్తుమందు కలిపి.. మహిళలపై నకిలీ బాబా అత్యాచారం.. ఎలా దొరికిపోయాడంటే..?

తమిళనాడులోని సేలం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఓ నకిలీ బాబా మహిళలు, మైనర్ బాలికలే లక్ష్యంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తేలింది. అంతేకాక ఆ దృశ్యాలను వీడియో తీస్తున్నట్లు స్పష్టమైంది. తన వద్దకు సమస్యలతో వచ్చే మహిళలు, యువతులకు ప్రసాదంలో మత్తుమందు కలిపి నకిలీ బాబా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తేలిన నేపథ్యంలో తాజాగా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆ డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని విజయరాజ(50)గా గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తమదైన శైలిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లాలోని వజపాడిలో సీక్రెట్ గా ఓ ఆశ్రమం నిర్వహిస్తున్నాడు విజయరాజ. తనను తాను దేవుడిగా చెప్పుకుండా అక్కడకు వచ్చే మహిళలు, మైనర్ బాలికలకు పూజలు నిర్వహిస్తున్నాడు. అలా అతని వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు కలిపిన తీర్థం, ప్రసాదాలు ఇచ్చి వారిపై లైంగికంగా దాడులకు పాల్పడేవాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి డార్క్ వెబ్‌ లో విక్రయించేవాడని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఇటీవల వినాయక చవితి చందాల కోసం వచ్చిన ఓ పాఠశాల విద్యార్థినితో విజయరాజ అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో అతని చీకటి బాగోతం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Fakegodman rapes women after spiking prasadam with sedatives the shocking incident in Tamil Nadu

బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో సాలెం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని విజయరాజను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే దర్యాప్తులో భాగంగా.. నకిలీ బాబా ల్యాప్‌ టాప్‌ లో 50 కు పైగా అశ్లీల వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చే మహిళలకు ప్రసాదంలో మత్తుమందు కలిపి వారిపై అత్యాచారానికి పాల్పడినట్టు విచారణలో తేలిందన్నారు. ఆపై వీడియోలు తీసి, డార్క్ వెబ్‌ సైట్స్ లో విక్రయించి వాటితో డబ్బులు పోగేసుకున్నట్టు విజయరాజ నేరం అంగీకరించిన పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుపై పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+