ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా.. జపోరిజియా నగరంపై భీకర దాడులు

రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరం అయ్యాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. రష్యాలో ప్రస్తుతం పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్న వేళ వందలాది డ్రోన్లతో మాస్కోపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు రష్యాలోని పలు బిల్డింగ్స్, ఆయిల్ రిఫైనరీ స్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన దాదాపు 1000 కు పైగా డ్రోన్లలో 450 కు పైగా డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నట్లు రష్యా స్పష్టం చేసింది. అయితే తాజాగా ఉక్రెయిన్ పై రష్యా ప్రతీకార దాడులు చేపట్టింది. దక్షిణ ఉక్రెయిన్ లోని జపోరిజియా నగరం లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడింది. రష్యా దాడుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జపోరిజియా నగరంలోని అపార్ట్ మెంట్ బ్లాక్స్, యూనివర్సిటీ, షాపింగ్ మాల్ తో పాటు ఇతర సైట్స్ లో రష్యా దాడులు చేపట్టిందని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

ఇక రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా అటు ఉక్రెయిన్ ఇటు రష్యాలోని ప్రజల రోజూవారీ జీవన విధానం అత్యంత దుర్బలంగా మారినట్లు స్పష్టం అవుతోంది. ఈ వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రపంచ దేశాల అధినేతలు హాజరుకానున్న తరుణంలో ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం తీవ్రతరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక న్యూయార్క్ లో నిర్వహించే సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తాను సమావేశం కానున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం.

Russia launches counter-attacks on Ukraine Zaporizhzhia city targeted Zelenskyy reveals details

ఇక తాజాగా రష్యాపై ఉక్రెయిన్ దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య 'రిడికులస్' గా అభివర్ణించారు. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా తన డీజిల్ చమురు ఉత్పత్తిపై నియంత్రణ కోల్పోయిందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలోని డీజిల్, చమురు రిఫైనరీలు ధ్వంసం అయ్యాయని సోషల్ మీడియా పోస్టు ద్వారా ట్రంప్ వెల్లడించారు. ఇటీవల రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఇరాన్ పై అమెరికా దాడులను ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు రష్యాలోని చమురు రిఫైనరీలపై దాడులను వెంటనే ఉక్రెయిన్ ఆపాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీకు సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+