మచిలీపట్నం-తమిళనాడు మధ్య ప్రత్యేక రైళ్లు-షెడ్యూల్, స్టాప్ లు ఇవే..!

పండుగల సీజన్ కారణంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. దీంతో ఎక్కడ చూసినా రైళ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రతీ రైల్వే జోన్ కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఏపీలోని మచిలీపట్నం నుంచి తమిళనాడులోని తిరుచెందూర్ మధ్య రాకపోకలు సాగించేలా ప్రత్యేక రైళ్లను (Machilipatnam-Tiruchendur special trains) ప్రకటించారు. ఈ రైళ్ల రాకపోకలు, షెడ్యూల్, హాల్ట్ లు, ఇతర వివరాలను అధికారులు వెల్లడించారు.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఈ 4 రైళ్ల స్టాప్ పై రైల్వే కీలక నిర్ణయం..!
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఈ 4 రైళ్ల స్టాప్ పై రైల్వే కీలక నిర్ణయం..!

మచిలీపట్నం నుంచి తిరుచెందూరు మధ్య వారానికి రెండుసార్లు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇందులో రైలు నంబర్ 07440 మచిలీపట్నం-తిరుచెందూరు ఎక్స్ ప్రెస్ ప్రతీ శుక్రవారం, శనివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ నెలలో 11, 12, 18, 19 తేదీల్లో ఈ రైలును అందుబాటులో ఉంచారు. అలాగే మరో రైలు నంబర్ 07439 తిరుచెందూరు నుంచి మచిలీపట్నానికి ప్రతీ శనివారం, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సెప్టెంబర్ 12, 13, 19, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

Machilipatnam Tiruchendur Special Trains Announced Check Dates Timings and Stoppages
పల్నాడులో ఆ ఉద్యోగుల రైలుకు హాల్ట్ ఖరారు- ఆ రోజు నుంచే-టైమింగ్స్ ఇవే..!
పల్నాడులో ఆ ఉద్యోగుల రైలుకు హాల్ట్ ఖరారు- ఆ రోజు నుంచే-టైమింగ్స్ ఇవే..!


ఈ రెండు రైళ్లకూ గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో స్టాప్ లు ఇచ్చారు. అలాగే ఈ రెండు రైళ్లలోనూ ఒక ఫస్ట్ ఏసీ, రెండు సెకండ్ ఏసీ, రెండు థర్డ్ ఏసీ, 9 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. కాబట్టి మచిలీపట్నం నుంచి తమిళనాడు వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ రైళ్లకు ప్రస్తుతం ఇచ్చిన తేదీల్లో రాకపోకల తర్వాత అదే రద్దీ కొనసాగితే మరింత కాలం పొడిగించే అవకాశం కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+