ఏపీలో భారీ వర్షాలతో పలు విమానాలు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. ప్రయాణికులకు అలెర్ట్!

ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఏపీలో అర్నాబ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అధికారులు పలు విమానాలను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులను ముందుగానే విమాన వివరాలు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్‌కు మళ్లించారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. భారీ వర్షాల కారణంగా ల్యాండింగ్ సాధ్యం కాకపోవడమే దీనికి కారణం అని అధికారులు చెప్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి.

AP heavy rains flights Heavy Rains in AP Disrupt Flights - Several flights Cancelled and Diverted

ముఖ్యంగా బుధవారం రాత్రి భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఒక విమానాన్ని నాగపూర్‌కు మళ్లించారు. విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఈ విమానంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సాయంత్రం 9:40 గంటలకు భోగాపురం చేరుకోవాల్సి ఉంది. కానీ భారీ వర్షాల వల్ల సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దాంతో విమానాన్ని నాగపూర్‌కు మళ్లించారు.

సుమారు రెండు గంటల తర్వాత నాగపూర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ రెండు గంటల పాటు తాము, తోటి ప్రయాణికులు ఎంతో ఆందోళనకు లోనయ్యామని చెప్పారు. ఆ తర్వాత విమానం నాగపూర్ నుంచి బెంగళూరు మీదుగా భోగాపురం చేరుకుంది.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం-పోలాకి మధ్య తీరం దాటిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షం పడుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

హైదరాబాద్ ను మించి ప్రపంచం చెప్పుకునేలా అమరావతి.. పాన్-ఐఐటీ కాన్ఫరెన్స్ తో చంద్రబాబు బిగ్ ప్లాన్!
హైదరాబాద్ ను మించి ప్రపంచం చెప్పుకునేలా అమరావతి.. పాన్-ఐఐటీ కాన్ఫరెన్స్ తో చంద్రబాబు బిగ్ ప్లాన్!

వర్షాల నేపధ్యంలో విమాన ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను ముందుగానే నిర్ధారించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఎయిర్ పోర్ట్ కి వచ్చి ఇబ్బంది పడొద్దని, షెడ్యూల్స్ చూసుకున్నాకే రావాలని చెప్తున్నారు. వాతావరణం మెరుగుపడే వరకు విమాన షెడ్యూల్స్ లో మరిన్ని మార్పులు రావచ్చని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+