దసరా రద్దీ వేళ ఏపీ మీదుగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు - రూట్లు, షెడ్యూల్..!!
దసరా రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు రూట్లను ఖరారు చేసింది. దసరా వేళ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణాలు కొనసాగుతాయి. ప్రధాన మార్గాల్లో రైళ్లల్లో రద్దీ పెరగనుంది. ఇప్పటికే పలు రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో, ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు నడిచే మార్గాలతో పాటుగా టైమింగ్స్ ను అధికారులు వెల్లడించారు.
దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-నర్సాపూర్ మార్గంలో 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబరు 4నుంచి నవంబరు 29 వరకు ప్రతీ ఆదివారం రాత్రి 10 గంటలకు నర్సాపూర్ నుంచి 07062 ప్రత్యేక రైలు, అక్టోబరు 5నుంచి నవంబరు 30వరకు ప్రతీ సోమవారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి 07063 ప్రత్యేక రైలు బయల్దేరుతాయని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. నరసాపూర్ - చర్లపల్లి- నరసాపూర్ నడుమ మెుత్తం 18 సర్వీసులు నడపాలని నిర్ణయించారు.

ప్రత్యేక రైళ్లు - షెడ్యూల్
ట్రైన్ నెంబర్ 07062 నరసాపురం - చర్లపల్లి ఆదివారం రాత్రి 10 గంటలకు బయల్దేరుతుంది. సోమవారం ఉదయం 8.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 04.10.2026 నుండి 29.11.2026 వరకు 9 సర్వీసులు నడుస్తాయి. ట్రైన్ నెంబర్ 07063 చర్లపల్లి - నర్సాపూర్ సోమవారం రాత్రి 7.50 బయల్దేరి మంగళవారం ఉదయం 7.00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. 05.10.2026 నుండి 30.11.2026 వరకు 9 సర్వీసులు ఉంటాయి. అదే విధంగా నెంబర్ 06021 పోదనూర్ - బరౌని ఆదివారం ఉదయం 06.15లకు బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం 01.30 గంటలకు బరౌని చేరుకుంటుంది. 04.10.2026 నుండి 01.11.2026 వరకు 5 సర్వీసులు నడుస్తాయి. రైలు నెంబర్ 06022 బరౌని - పోదనూర్ బుధవారం ఉదయం 10.30 బయల్దేరి శుక్రవారం సాయంత్రం 06.30కి చేరుకుంటుంది. 07.10.2026 నుండి 04.11.2026 వరకు 5 సర్వీసులు నడవనున్నాయి.













Click it and Unblock the Notifications
