ఖైరతాబాద్ ఉప ఎన్నిక లో పోటీ, పార్టీ పై దానం సంచలన ప్రకటన..!!
మరో ఉప ఎన్నిక ఖాయమైంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు ను సుప్రీం సమర్థించింది. ఇక, ఉప ఎన్నిక నిర్వహించాలని సూచన చేసింది. హైకోర్టు తన పైన వేసిన అనర్హత వేటు పైన దానం సుప్రీంను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీం సమర్దించింది. దీంతో.. దానం స్పందించారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఉప ఎన్నికల్లో తన పోటీతో పాటు గా పోటీ చేసే పార్టీ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. హైకోర్టు తీర్పు పైన దానం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో దానం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపు చ్చింది. ఈ పిటిషన్‌పై విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. ఆయనపై అనర్హత వేటు పడిందని.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. వ్యక్తిగతంగా పార్టీలో చేరితే తప్పు కాదని.. పదవితో పాటు ఫిరాయింపు తప్పేనని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు ఉత్తర్వు ల్లో ఎలాంటి జోక్యం చేసుకోమని నిరాకరిస్తూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే గా ఒక పార్టీలో కొనసాగుతూ వేరే రాజకీయ పార్టీ టికెట్‌పై నామినేషన్ వేసి పోటీ చేయడం రాజ్యాంగబద్ధం గా పార్టీని వీడినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

కాంగ్రెస్ లో పెరుగుతున్న పోటీ
అదే సమయంలో సుప్రీంలో 'ఘర్ వాపసీ' వాదనలను దానం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వినిపించారు. తిరిగి పార్టీలోకి వచ్చినంత మాత్రాన చట్టసభ సభ్యత్వంపై పడే అనర్హత వేటు తొలగిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా.. ఈ తీర్పు పైన దానం స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పు రావటంతో.. ఇక ప్రజా క్షేత్రంలో తేల్చు కుంటా అని దానం స్పష్టం చేసారు. తాను నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటానని ప్రకటించారు. ఇలాంటి పరిణామాలు ఉంటాయని ముందే ఊహించినట్లు వెల్లడించారు. కాగా.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో టికెట్ వచ్చిన తర్వాత చెబుతా.. అంటూ దానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ సీటు కోసం పోటీ నెలకొన్న క్రమంలో దానం చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిగా మారాయి.












Click it and Unblock the Notifications
