శబరి సహా 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు: బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- రూట్, షెడ్యూల్..!!

రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. సెలవుల వేళ బెంగళూరు మార్గంలో పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైళ్లకు సంబంధించి రూట్.. షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. అదే విధంగా శబరి సహా ఎనిమిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త టైమింగ్స్ షెడ్యూల్ విడుదల చేసారు. పండుగల వేళ జనసాధారణ్ రైళ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ప్రధాన మార్గాల్లో నడిచే ఎనిమిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు చేస్తూ ప్రకటన చేసింది. ఈ మార్పులు నవంబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. త్రివేండ్రం-చర్లపల్లి (17042) ఎక్స్‌ప్రెస్‌ గుంటూరుకు సాయంత్రం 5 గంటలకు, సత్తెనపల్లికి 5.45 గంటలకు చేరుకుంటుంది. తిరుచిరాపల్లి-చర్లపల్లి (17078) ఎక్స్‌ప్రెస్‌ గుంటూరుకు మధ్యాహ్నం 2.40 గంటలకు, సత్తెనపల్లికి 3.20 గంటలకు, నడికుడికి సాయంత్రం 4 గంటలకు చేరుతుంది. అలాగే, కాచిగూడ- రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ పిడుగురాళ్లకు రాత్రి 2.40 గంటలకు, త్రివేండ్రం- సికింద్రాబాద్‌ (20630) మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ సత్తెనపల్లికి ఉదయం 6.45 గంటలకు చేరుకుంటాయి. గుంటూరు-కాచిగూడ (17251) ఎక్స్‌ప్రెస్‌ రైలు సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. నవంబరు ఏడు నుంచి మైసూరు నుంచి కాకినాడ వెళ్లే (17290) ఎక్స్‌ప్రెస్‌, 6 నుంచి హిసార్‌ - కాకినాడ (17296), చర్లపల్లి - తిరుపతి (17444) ఎక్స్‌ప్రెస్‌ల వేళల్లోనూ స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపారు.

జెత్వానీ కేసులో ఆ ఇద్దరు ఐపీఎస్ ల పై సస్పెన్షన్ ఎత్తివేత, రెండేళ్ల తరువాత పోస్టింగ్..!!
జెత్వానీ కేసులో ఆ ఇద్దరు ఐపీఎస్ ల పై సస్పెన్షన్ ఎత్తివేత, రెండేళ్ల తరువాత పోస్టింగ్..!!
railway-officials-announces-changes-of-running-timings-for-eight-express-trains-from-november-4-her

బెంగళూరు కు ప్రత్యేక రైళ్లు.. ఈ మార్గంలో

కాగా, పండుగల సీజన్‌లో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్‌ నుంచి.. సికింద్రాబాద్‌ మీదుగా యశ్వంతపూర్‌ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిసెంబరు 7వరకు ఈ రైళ్లు అందుబాటు లో ఉంటాయి. 04135 ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సుబేదార్‌గంజ్‌ నుంచి, 04136 ప్రత్యేక రైలు ప్రతి సోమవారం యశ్వంతపూర్‌ నుంచి బయల్దేరుతాయి. ఈ రైళ్లకు శంకర్‌ఘర్‌, దబోరా, మాణిక్‌పుర్‌, సత్నా, కాట్ని, జబల్‌పూర్‌, ఇటార్సి, నాగపూర్‌, బలార్ష, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖాజీపేట్‌, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, యాద్గిర్‌, కృష్ణ, రాయచూర్‌, గుంతకల్‌, అనంతపూర్‌, ధర్మవరం, హిందూపూర్‌, ఎలహంక స్టేషన్లలో ఇరువైపులా హాల్ట్‌ ఉంటుందని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య రెండు జన సాధారణ్‌ (అన్‌ రిజర్వ్‌డ్‌) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+