దానం అనర్హత పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం, నెక్స్ట్ ఇక..!!

దానం నాగేందర్ అనర్హత వ్యవహారం పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు ఇప్పటికే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసింది. హైకోర్టు తీర్పు పైన సుప్రీంలో దానం ఎస్ఎల్పీ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. దానం పై హైకోర్టు తీర్పును సమర్థించింది. దానం కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సమయంలోనే అనర్హతకు గురయ్యారని.. ఖైరతాబాద్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొంది.

దానం నాగేందర్ పైన సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తన పైన అనర్హత వేటు వేయటంతో సుప్రీం ను ఆశ్రయించారు. దానం పిటీషన్ పైన బీజేపీ, బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనల తరువాత సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. దానం పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది.

 దానం తరువాతి వికెట్ ఆయనే, అధారాలు పక్కా..? కేసీఆర్ ఫిక్స్..!!
దానం తరువాతి వికెట్ ఆయనే, అధారాలు పక్కా..? కేసీఆర్ ఫిక్స్..!!
Supreme court supports high court decision on Danam Nagender disqualification directs for Khairtabad by poll

దానం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ను తిరస్కరించిన సుప్రీం కోర్టు.. దానం పైన ఇప్పటికే అనర్హత వేటు పడిందని.. ఖైరతాబాద్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చని పేర్కొంది. దానం తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నట్లుగా అసెంబ్లీ రికార్డులు స్పష్టం చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో దానం నాగేందర్ పిటీషన్ ను తిరస్కరిస్తూనే.. ఇప్పటికే దానం అనర్హతకు గురయ్యారని వ్యాఖ్యానించారు.

కాగా, దానం నాగేందర్ తన పిటీషన్ లో తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని.. తన పైన ఆ పార్టీ ఎలాంటి చర్య తీసుకోలేదని వివరించే ప్రయత్నం చేసారు. స్పీకర్ కోర్టు సైతం దానం పైన విచారణ ఆలస్యం చేసినా చర్యలు తీసుకోలేదని బీజేపీ తమ వాదనల్లో కోర్టుకు వివరించారు. అనర్హత పడింది.. మళ్లీ ఎన్నికలకు వెళ్లండంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

 దానం లెక్కే వేరు, నాడు టీడీపీలో గెలిచి వెంటనే - పలు పార్టీలు మారి.. ఇలా..!!
దానం లెక్కే వేరు, నాడు టీడీపీలో గెలిచి వెంటనే - పలు పార్టీలు మారి.. ఇలా..!!

వ్యక్తిగతంగా పార్టీలో చేరితే తప్పు కాదు పదవితో పాటు ఫిరాయింపు తప్పేనని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో.. దానం నాగేందర్ అంశంలో ఈసీ అధికారిక ప్రకటనే తఱువాయి అన్నట్లుగా పరిస్థితి మారింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూనే... కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయటంతో నే దానం పైన అనర్హత ఖాయమైందని వ్యాఖ్యానించారు. ఇక, సుప్రీంలోనూ దానంకు ఎదురు దెబ్బ తగలటంతో.. ఇప్పుడు ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక ఖాయమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+