మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?
ఓవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామకంపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తోంది. మరోవైపు అదే కమిషనర్లు అంతర్గత విభేదాలతో రచ్చకెక్కారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తమకు తెలియకుండానే పలు కీలక నిర్ణయాలు తీసేసుకుంటున్నారని తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ అధికారికంగానే తమ అసమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్లో కేంద్రం ఏరికోరి తెచ్చుకుంటున్న ఈ ఇద్దరు కమిషనర్ల నేపథ్యాలు ఏంటో ఓసారి చూద్దాం.
ఎన్నికల కమిషనర్ల అసమ్మతి (Election Commissioners)
కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్‌బీర్ సింగ్ సంధూ గత పది నెలల కాలంలో ఈసీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై కనీసం 14 సార్లు తమ వ్యతిరేకతను రికార్డు చేశారు. ముఖ్యంగా ఓటర్ల నమోదు డేటాబేస్‌ను కేంద్రీకరించడం వల్ల రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ఈరోనెట్ వ్యవస్థపై పూర్తి స్థాయిలో నియంత్రణ, యాక్సెస్ లేకుండా పోతోందని సుఖ్‌బీర్ సంధూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించే 'ఫామ్ 6' లో ముందస్తు అనుమతి లేకుండా చేసిన మార్పులు అక్రమమని, నిబంధనలకు విరుద్ధమని వివేక్ జోషి స్పష్టం చేశారు. అయితే, కమిషన్‌లో ఎటువంటి విభేదాలు లేవని, నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే సాగాయని ఈసీ ఈ నివేదికలను ఖండించింది.

ఎవరీ వివేక్ జోషి ?
సీఈసీ నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వివేక్ జోషి 1989 బ్యాచ్‌కు చెందిన హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన, కేంద్ర డీఓపీటీ విభాగంలో కార్యదర్శిగా సుదీర్ఘ సేవలు అందించారు. ఐఐటీ రూర్కీలో చదివిన జోషి, జెనీవా విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈయన 2025 ఫిబ్రవరి 19న ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచీ ఆయన కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న పలు నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు.















Click it and Unblock the Notifications
