షాకింగ్ వీడియో: "నా అన్నకి ఫోన్ చేస్తా" వదల్లేదు.. బాలికను చుట్టిముట్టి..!

బీహార్‌లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగింటే మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం జముయీ జిల్లాలో మైనర్ బాలికను బహిరంగంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటన తాలూకు షాక్ నుంచి కోలుకోకముందే సమస్తిపూర్‌లో మరో బాలిక పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణంపై తక్షణమే స్పందించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్
మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి జగత్‌సింగ్‌పూర్ సమీపంలోని గట్టు వద్ద ఫోటోలు దిగేందుకు ఆగింది. ఆ సమయంలో అక్కడున్న కొందరు స్థానిక యువకులు ఆమెను చుట్టుముట్టి వేధించడం మొదలుపెట్టారు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. ఓ యువకుడు పదే పదే ఆమె చేతిని పట్టుకుని లాగాడు. తన అన్నకు ఫోన్ చేస్తానని బాధితురాలు హెచ్చరించినప్పటికీ.. ఆకతాయిలు ఏ మాత్రం భయపడకుండా 'సరే..ఫోన్ చేయ్..' అంటూ వెటకారంగా మాట్లాడుతూ మరింత అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్న వారే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది.

Bihar Samastipur Girl Harassment Video Viral Four Accused Arrested by Police Full Details Here

సెప్టెంబర్ 23 సాయంత్రం సోషల్ మీడియా మానిటరింగ్ సమయంలో ఆ వీడియో తమ దృష్టికి వచ్చినట్లు సమస్తిపూర్ ఎస్పీ అరవింద్ ప్రతాప్ సింగ్ తెలిపారు. విషయాన్నీ తీవ్రంగా పరిగణించిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ ఘటన కర్పూరి గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగతాసింగ్ పూర్ వంతెన సమీపంలో జరిగినట్లు గుర్తించారు. బాధితురాలు మైనర్ బాలికగా కనిపించడంతో పోలీసులు స్వచ్ఛందంగా ఫిర్యాదు నమోదు చేసి బీఎన్ఎస్, పోక్సో చట్టం, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

అంత సీన్ ఉందనుకుంటే నీళ్లు మోసేందుకే పరిమితం చేశారు: జపాన్ కెప్టెన్ సెటైర్!
అంత సీన్ ఉందనుకుంటే నీళ్లు మోసేందుకే పరిమితం చేశారు: జపాన్ కెప్టెన్ సెటైర్!

కేసు నమోదు చేసిన కేవలం 6 గంటల వ్యవధిలోనే వీడియో ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అలాగే బాధితురాలు మైనర్ అయినందున ఆమె గుర్తింపునకు భంగం కలిగించేలా ఎలాంటి వీడియోలు లేదా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాంటి కంటెంట్ ను షేర్ చేయడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరమని హెచ్చరించారు. జముయీ ఘటనలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా.. ఇప్పుడు సమస్తిపూర్ ఘటన కూడా చోటుచేసుకోవడం బీహార్లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+