తెలంగాణలో రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లు, ఆఫీసులకు సెలవు - ప్రభుత్వం ఉత్తర్వులు..!!
తెలంగాణ ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పలు జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శోభాయాత్రలు, నిమజ్జన వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగడంతో పాటు ప్రజలకు, విద్యార్థులకు సదుపాయంగా ఉండేందుకు సెలవు ప్రకటించింది. బదులుగా వచ్చే నెల రెండో శనివారం పని దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
గణేష్ నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో సహా పరిసర ప్రాంతాల్లోనూ ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. దీంతో, వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శోభాయాత్ర లు, నిమజ్జన వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగడంతో పాటు ప్రజలకు, విద్యార్థులకు సదుపాయంగా ఉండేందుకు ఈ నెల 25 శుక్రవారం రోజున సాధారణ సెలవును ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సెలవుకు బదులుగా రాబోయే నవంబర్ 14న వచ్చే రెండో శనివారాన్ని పూర్తిస్థాయి పనిదినంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో
కాగా, ప్రభుత్వంలోని అన్ని విభాగాలు మరియు విద్యాసంస్థల అధికారులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అదే విధంగా పాఠశాలలకు దసరా సెలవుల పైనా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబరు 10 నుండి 22వ తేదీ వరకు మొత్తంగా 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన అకడమిక్ విద్యా క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులను ఖరారు చేసినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ 13 రోజుల్లో అక్టోబరు 10న రెండో శనివారం, అలాగే 11, 18 తేదీలు ఆదివారాలు కావడంతో నికరంగా పది రోజులే పనిదినాల సెలవులుగా ఉండనున్నాయి. కాగా, అటు ఏపీలో అక్టోబర్ 12 నుంచి దసరా పండుగ సెలవులు మొదలు కానున్నాయి.













Click it and Unblock the Notifications
