ఉచిత బస్సు పథకంతో మహిళల గౌరవం తగ్గిందా..? పెరిగిందా..? నో టికెట్.. జీరో రెస్పెక్ట్..!!

ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటూ నేటికాలంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. చివరకు చంద్రునిపై కూడా కాలు పెట్టగలిగే స్థాయికి ఎదిగారు. పురుషులతో సమానంగానే కాదు కాదు .. కొన్ని కొన్ని రంగాల్లో పురుషుల కంటే మిన్నగా ఎదుగుతూ తమ సత్తా చాటుతున్నారు. అయితే ఇటీవలికాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సాధికారతే లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి అని చాటిచెబుతూ వారికోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయి. సుకన్య సమృద్ధి యోజన, భేటీ బచావో భేటీ పడావో, ప్రధానమంత్రి ముద్రా యోజన, లఖ్ పతీ దీదీ పథకాలతో కేంద్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిన పథకమే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మహిళలు, చిన్నారులు, ట్రాన్స్ జెండర్స్ కు రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తోంది.

మహాలక్ష్మి పథకంతో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణం చేసేందుకు అవకాశం కలిగింది. ఉచిత బస్సు ప్రయాణంతో రోజుకు 37.09 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం గణాంకాలను వెల్లడించింది. ఈ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలు రూ. 2,428. 47 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించింది. అయితే పైకి కనిపించే ఈ లెక్కల మాటున మహిళల ఇబ్బందులు, అవమానాలు, సవాళ్లు, సమస్యలు దాగి ఉన్నాయని లోతుగా అధ్యయనం చేస్తే అర్థం అవుతోంది. ఫ్రీ బస్సు పథకం వచ్చాక ఎన్నడూ లేని విధంగా బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. సీట్లు ఖాళీ లేక మహిళలు, వృద్ధులు గంటల తరబడి బస్సులో నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తోందని లక్ష్మమ్మ అనే వృద్ధురాలు వన్ ఇండియాతో పేర్కొంది.

" ఫ్రీ బస్సు పథకంతో మాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు. నాకు కాళ్ల నొప్పులు.. ఎక్కువ సేపు నిలబడలేను. అయినా సీటు లేక నిలబడి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాం. అనారోగ్య బారిన పడుతున్నాం. బస్సులు తక్కువ.. ప్రయాణికులు ఎక్కువ అయిపోయారు. మేము ఆపమన్న చోట ఆపడం లేదు.. దిగాలన్న చోట దింపడం లేదు" అని కుండల వ్యాపారి, వృద్ధురాలు లక్ష్మమ్మ తన ఆవేదనను వెల్లడించింది.

మరోవైపు రోజూ డిగ్రీ కాలేజీకి బస్సుల్లో వెళ్లే శ్రీనివాస్ అనే విద్యార్థి వన్ ఇండియాతో మాట్లాడుతూ.. బస్సుల సంఖ్య తగ్గువగా ఉంది. రోడ్డుపై నిల్చున్న గంటా గంటన్నరకు ఓ బస్సు వస్తుంది. బస్సుల కొరత కారణంగా సమయానికి కాలేజీకి వెళ్లలేక పోతున్నాం. పురుషుల సీట్లలోనూ మహిళలు కూర్చొంటున్నారు. ఫ్రీ బస్సు పథకం వచ్చాక రద్దీ బాగా పెరిగింది. ఫుట్ బోర్డింగ్ లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇక బస్సు పాస్ ల రేట్లను అడ్డగోలుగా పెంచారు. గతంలో ఇప్పటికీ 400 లకు పైగా బస్ పాస్ రేట్ పెరిగింది" అని విద్యార్థి శ్రీనివాస్ తెలిపాడు.

ఇక మరో వ్యక్తి రమేశ్ వన్ ఇండియాతో మాట్లాడుతూ.. ఇటీవలికాలంలో బస్సు టికెట్ రేట్లను గణనీయంగా పెంచారని వాపోయారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషుల జేబుకు చిల్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే బస్సులు లేవు. వచ్చిన బస్సుల్లో మహిళలే మొత్తం కూర్చొంటున్నారు. టికెట్ తీసుకుని నిలబడి రోజూ షాపుకు పోతున్నా అని రమేశ్ తెలిపాడు. బస్సుల సంఖ్య పెంచాలని ఆయన అన్నాడు. లేదా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా బస్సులను నడపాలను కోరాడు.

" బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తూన్నాం. బస్సు వచ్చినా మేము ఉన్న చోట ఆగదు.. కొంచెం ముందు వెళ్లి ఆగుతుంది. మళ్లీ అక్కడి వరకూ పరుగెత్తుకుంటూ వేళ్తాం. ఈ క్రమంలో ఒకరిమీద ఒకరు పడి గొడవ జరుగుతుంది. రోజూ గొడవ పడుతూనే కాలేజీకు పోతున్నం." అని నిషిత అనే కాలేజీ స్టూడెంట్ వన్ ఇండియా కు వివరించింది. అయితే ఉచిత బస్సు పథకం ద్వారా మహిళల గౌరవం మరింత పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కానీ తమ గౌరవం మరింత తగ్గిందని శివానీ అనే కాలేజీ టీచర్ వన్ ఇండియాతో మాట్లాడుతూ తెలిపారు.

నో టికెట్.. నో రెస్పెక్ట్..!

" నేను ఆరేళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నాను. కానీ ఉచిత బస్సు పథకం వచ్చాక ఆర్టీసీ స్టాఫ్ మహిళలపై చూపించే గౌరవం తగ్గిపోయింది. మమ్మల్ని చులకనగా చూస్తుంటారు. గతంలో ఒక్కో బస్ స్టాప్ లో చాలా సమయం బస్సులను ఆపేవారు. ఇప్పుడు కొన్ని సెకన్ల పాటే బస్సులను ఆపుతున్నారు. మేము ఉచితంగా ప్రయాణిస్తున్నాం.. అందుకే మాకు వాళ్లు గౌరవం ఇవ్వట్లేదు కావొచ్చు " అని శివానీ అభిప్రాయపడ్డారు.

ఇక ఆర్టీసీ స్టాఫ్ వాదన మరోలా ఉంది. కృష్ణ అనే డ్రైవర్ వన్ ఇండియాతో మాట్లాడుతూ.. ప్రయాణికులే తమకు గౌరవం ఇవ్వడం లేదని తెలిపాడు. వాళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆపమంటారు. మేము అలా ఆపొద్దు.. ఎందుకు ఆపలేదంటూ తమతో గొడవకు దిగుతారు. రోజూ ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ప్రయాణికులు తమపై దాడి చేసిన సందర్భాలూ ఉన్నాయి. 50 మందిని తీసుకెళ్లాల్సిన బస్సు 120 మందిని తీసుకెళ్తోంది.. అని పేర్కొన్నాడు.

freebus scheme in Telangana Has the women s dignity diminished No ticket zero respect for women

ఇక మహాలక్ష్మి పథకం డేంజరస్ గా మారిందని పాల్ అనే విద్యార్థి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మహిళలకు ఉచితమే.. కానీ అధికంగా టికెట్ ధరలు పెంచి మిమ్మల్ని దోచుకుంటున్నారు. వాళ్లు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాల్సింది పోయి ఉచిత బస్సులు అందిస్తున్నారు అని పాల్ మండిపడ్డాడు. విద్యార్థులకు సెపరేట్ బస్సులను ఏర్పాటు చేయాలని కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+