మచిలీపట్నం-కర్నాటక ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఈ రెండు రైళ్లు..!
దేశవ్యాప్తంగా పండుగల సందడి మొదలైంది. వివిధ రాష్ట్రాల్లో పండుగల వేళ ప్రయాణికుల రాకపోకలు కూడా అంతే స్దాయిలో పెరిగాయి. దీంతో రైల్వేశాఖ అలర్ట్ అయింది. వివిధ రాష్ట్రాలు, వివిధ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇదే క్రమంలో ఏపీలోని మచిలీపట్నం నుంచి కర్నాటకలోని శివమొగ్గ టౌన్ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పండగల రద్దీ నేపథ్యంలో రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
మచిలీపట్నం నుంచి శివమొగ్గ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను (Machilipatnam-Shivamogga special trains)
నడపాలని దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయించింది. అలాగే ఈ రెండు రైళ్లకు సంబంధించిన షెడ్యూల్, మధ్యలో ఆగే స్టేషన్లు, ఇతర వివరాలను కూడా ఇవాళ ప్రకటించింది. దీని ప్రకారం ఆగస్టు 30 ఆదివారం రోజు మచిలీపట్నం నుంచి శివమొగ్గకు ప్రత్యేక రైలు నంబర్ 07217 నడపనున్నారు. ఈ రైలు మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.55కు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు శివమొగ్గ టౌన్ స్టేషన్ కు చేరుతుంది.

అలాగే శివమొగ్గ నుంచి సెప్టెంబర్ 2వ తేదీన మరో ప్రత్యేక రైలు నంబర్ 07218 సాయంత్రం 5.40కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.55కు మచిలీపట్నం స్టేషన్ కు చేరుకోనుంది. ఈ రెండు రైళ్లకూ ఏపీలో గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం, కంభం, నంద్యాల, బేతంచెర్ల, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, సత్యసాయి నిలయం, హిందూపూర్ స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. ఈ రెండు రైళ్ల టైమింగ్స్ లో చివరి నిమిషంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు హింట్ ఇచ్చారు. దీంతో టికెట్లు బుక్ చేసుకునే ముందు, రైలు ఎక్కే ముందు ప్రయాణికులు గమనించాల్సి ఉంటుంది.















Click it and Unblock the Notifications