మచిలీపట్నం-షిర్డీ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కోచ్ ల మార్పు..!

ఏపీలోని మచిలీపట్నం నుంచి మహారాష్ట్రలోని సాయి నగర్ షిర్టీ స్టేషన్ కు రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలు (Machilipatnam-Sainagar Shirdi Express) ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్. ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం దక్షిణ కోస్తా రైల్వే మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ లో కోచ్ లను మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు దీన్ని ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది.

విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఇక ప్రతీ వారం..!
విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఇక ప్రతీ వారం..!

మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ కు ఉన్న ప్రస్తుత సాధారణ కోచ్ లను అత్యాధునిక ఎల్ హెచ్ బీ కోచ్ లుగా మారుస్తూ దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ రైలు (17208), అలాగే సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం రైలు (17207) రెండింటికీ కోచ్ లు మారతాయి. మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ రైలు కు ఇవాళ్టి నుంది, సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం రైలు కు రేపటి నుంచి ఇలా కోచ్ లు మారుస్తున్నారు. తాజా మార్పుల తర్వాత ఈ రెండు రైళ్లలోనూ ఒక ఫస్ట్ ఏసీ కోచ్, 2 సెకండ్ ఏసీ కోచ్ లు, 2 థర్డ్ ఏసీ కోచ్ లు, 9 స్లీపర్ క్లాస్ కోచ్ లు, 4 సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి. అలాగే దివ్యాంగ ప్రయాణికులకు అనుకూలమైన ఒక సెకండ్ క్లాస్ లగేజీ-బ్రేక్ వాన్, ఒక పవర్ కార్ కూడా ఉంటాయి.

Machilipatnam Sainagar Shirdi Express Upgraded to LHB Coaches from today
రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధలో కీలక మార్పులు..! నిమిషానికి లక్షన్నర బుకింగ్స్ ..!
రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధలో కీలక మార్పులు..! నిమిషానికి లక్షన్నర బుకింగ్స్ ..!

ఈ కోచ్ ల లోని యాంటీ-టెలిస్కోపిక్ డిజైన్ ప్రమాదం సంభవించినప్పుడు కోచ్‌లు ఒకదానిపై మరొకటి ఎక్కడం, పైకి లేవడం లేదా పరస్పరం లోనికి చొచ్చుకుపోవడాన్ని నిరోధిస్తుంది. తేలికపాటి క్రోమ్ స్టీల్‌తో తయారు చేసిన ఈ కోచ్‌లలో అధునాతన గ్యాస్-హైడ్రాలిక్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల అధిక వేగాల్లో కూడా తక్కువ దూరంలో సమర్థవంతంగా బ్రేకులు వేయవచ్చు. LHB కోచ్‌ల వల్ల రైలు నిర్వహణలో మెరుగుదలతో పాటు ప్రయాణ వేగం కూడా పెరుగుతుంది. ఈ కోచ్‌లలో అధిక ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. అలాగే రైలు గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో సురక్షితంగా నడిచే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తం ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+