తిరుపతి వీక్లీ ఎక్స్ ప్రెస్ ఇక రెగ్యులర్ రైలుగా, నెంబర్ మార్పు - రూట్, షెడ్యూల్..!!
తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుపతికి నిత్యం పెద్ద సంఖ్య లో రైళ్లు ఉన్నా... రద్దీతో కొనసాగుతున్నాయి. దీంతో.. తిరుపతికి పలు ప్రాంతాల నుంచి స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు. అదే విధంగా వీక్లీ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. తిరుపతి కి ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ప్రస్తుతం వీక్లీ ఎక్స్ ప్రెస్ గా నడుస్తున్న రైలు ను రెగ్యులర్ గా మార్పు చేస్తూ రైల్వే అధికారులు ప్రకటన చేసారు.
తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు మరో రైలు అందుబాటులోకి వచ్చింది. హిసార్ - తిరుపతి - హిసార్ వీక్లీ స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రెగ్యులర్ చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. దాదాపు ఆరు రాష్ట్రాల మీదుగా ఈ రైలు 2500 కిలో మీటర్ల మేర ప్రయాణం చేసి తిరుపతి చేరుకుంటుంది. రెగ్యులర్ చేయటంతో ఈ రైలు నెంబర్ మార్పు చేసారు. గతంలో 04717/04718 కాగా, ప్రస్తుతం 14723/14724. ఈ రైలు ప్రతి శనివారం హిసార్ (14723) నుంచి, ప్రతి సోమవారం తిరుపతి (14724) నుంచి రాకపోకలు కొనసాగించనుంది. హిసార్ - తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 25న శనివారం హిసార్ లో బయల్దేరి హర్యానా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. హర్యానాలోని హిసార్ లో మధ్యాహ్నం 2.10గంటలకు బయల్దేరుతుంది.

రైలు నెంబర్ మార్పు.. ప్రయాణీకులకు వెసులుబాటు
ఈ రైలు తెలంగాణలోకి ప్రవేశించి సిర్పూర్ కాగజ్నగర్, వరంగల్ మీదుగా అర్ధరాత్రి 12గంటలకు ఖమ్మం చేరుతుంది. అక్కడ నుంచి ఏపీలో రాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్ల మీదుగా ప్రారంభమై ఉదయం 8.20గంటలకు తిరుపతి చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలులో 2 -2ఏసీ బోగీలు, 7-3 ఏసీ బోగీలు, 8 స్లీపర్ బోగీలు, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతోపాటు మరో 2 సెకండ్ క్లాస్ కోచ్ లతో పాటుగా మొత్తం 23 బోగీలతో రాకపోకలు సాగించనుంది. ఈ రైలు రెగ్యులర్ చేయటం వలన తిరుపతికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పాటుగా తెలుగు ప్రయాణీకులకు మరింత వెసులు బాటుగా మారనుంది.












Click it and Unblock the Notifications