పెసరపప్పు ఇడ్లీ ఇలా చేస్తే సూపర్ టేస్టీ!
పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది పెసరపప్పుతో పెసరట్టు, పెసర వడలు చేస్తారు. పెసరపప్పుతో కూర కూడా చేసుకుంటారు. ఇంకా పెసరపప్పును ఇడ్లీలు చేసుకోవటానికి కూడా వినియోగించవచ్చు. పెసరపప్పుతో త్వరగా, సులభంగా రుచికరమైన ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. దీనికి పిండి పులియబెట్టాల్సిన అవసరం లేదు. నిమిషాల్లోనే రెడీ అయ్యే ఈ లైట్ బ్రేక్‌ఫాస్ట్ నోటికి రుచిగా, పొట్టకి హాయిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.
కావాల్సిన పదార్థాలు:
పెసరపప్పు 1 కప్పు,
ఉప్పు రుచికి,
జీలకర్ర 1 టీస్పూన్,
అల్లం ముక్కలు కొన్ని,
పసుపు అర టీస్పూన్,
పచ్చిమిర్చి 5,
పెరుగు పావు కప్పు,
బొంబాయి రవ్వ 3 టేబుల్ స్పూన్లు,
బేకింగ్ సోడా చిటికెడు,
ఇంగువ 2 చిటికెడ్లు,
క్యారెట్ 1,
కొత్తిమీర కొద్దిగా,
ఆయిల్ తగినంత.

తయారీ విధానం:
ముందుగా పెసరపప్పును బాగా కడిగి గంట సేపు నానబెట్టండి. పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీరను తరిగి ఉంచుకోండి. నానబెట్టిన పెసరపప్పును మిక్సీలో వేసి ఉప్పు, జీలకర్ర, అల్లం, పసుపు, పచ్చిమిర్చి, పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బొంబాయి రవ్వ, బేకింగ్ సోడా, ఇంగువ, తరిగిన క్యారెట్, కొత్తిమీర కలపండి.
ఇలా చేస్తే మంచి బ్రేఫ్ ఫాస్ట్ తినొచ్చు
ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసి మరిగించండి. ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ రాసి పిండి పోసి, మీడియం ఫ్లేమ్‌పై 15 నిమిషాలు ఉడికించండి. రెండు నిమిషాలు వేడి మీదనే ఉంచి తర్వాత తీయండి.
కమ్మని పెసరపప్పు ఇడ్లీలు రెడీ అవుతాయి. మీకు ఇష్టమైన పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ తో సర్వ్ చేసుకోండి. ఎక్కువ మోతాదు కావాలంటే దానికి తగ్గట్టు పదార్ధాలను పెంచుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్.
పెసరపప్పులో ఫుల్ పోషకాలు
పెసరపప్పు లో చాలా మంచి పోషకాలు ఉంటాయి. పెసరపప్పు ఇడ్లీలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన కండరాల బలానికి, జీర్ణక్రియ మెరుగుదలకు, తక్షణ శక్తిని ఇవ్వటానికి దోహదం చేస్తాయి. అటువంటి పెసరపప్పు ఇడ్లీలు కడుపుకి హాయిగా, లైట్ గా ఉండటమే కాకుండా మంచి శక్తిని ఇస్తాయి.













Click it and Unblock the Notifications
