మొహ్సిన్ నఖ్వీకి బిగ్ పంచ్.. హర్మన్‌ప్రీత్ చేసిన పని చూస్తే నవ్వాల్సిందే! (వీడియో)
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ గెలిచిన తర్వాత భారత జట్టుకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్, శ్రీలంకను ఓడించి ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో గెలిచినప్పటికీ.. భారత మహిళల జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. అంతకుముందు 2025లో పాకిస్థాన్‌పై ఫైనల్‌లో గెలిచినప్పటికీ పురుషుల జట్టు కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది. భారత జట్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిన అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీనే కారణం .
అయితే మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోనప్పటికీ.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విజయోత్సవం జరుపుకున్న తీరు అందరి హృదయాలను గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మొహ్సిన్ నఖ్వీ హాజరు కావడం వల్ల భారత జట్టు కప్ ప్రదానోత్సవానికి హాజరుకావడానికి నిరాకరించింది. అనంతరం విజయోత్సవాల ఫోటో కోసం జట్టు మొత్తం స్టేడియంలో తోటి ప్లేయర్లకు హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ వాటిర్ బాటిల్‌ను అందించారు. మిగతా జట్టు సభ్యులు కెప్టెన్‌ను ఉత్సాహపరుస్తూ, ఆ వాటిర్ బాటిల్‌ను ఒక ట్రోఫీలా గాలిలోకి ఎత్తమని ఆమెను ప్రోత్సహించారు. హర్మన్‌ప్రీత్ ఏమాత్రం సంకోచించకుండా చిరునవ్వుతో, ఓ ఛాంపియన్‌లా ఆ వాటిర్ బాటిల్‌ను గాలిలో ఊపింది.

Pure joy and unfiltered emotions 🥳
— BCCI Women (@BCCIWomen) September 14, 2026
🎥 Catch #TeamIndia's heartwarming 𝙍𝙖𝙬 𝙍𝙚𝙖𝙘𝙩𝙞𝙤𝙣𝙨 moments after sealing the #WomensAsiaCup triumph 🇮🇳🏆#INDvSL pic.twitter.com/e4zYfBAvSE
వైరల్ అవుతున్న వీడియో
హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన సరదా చేష్టను చూసి భారత జట్టు మొత్తం పగలబడి నవ్వింది. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోనప్పటికీ.. టీమిండియా వైఖరి అభిమానులను ఎంతగానో ఆనందపరిచింది. అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ భారత జట్టు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి ట్రోఫీ అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.
Indian Team celebrating with water bottle 😂😂#AsiaCup #Women'sAsiaCup pic.twitter.com/qLt2OWEtS2
— Darshika (@DarshikaRai3) September 14, 2026














Click it and Unblock the Notifications
