పాకిస్థాన్ లో భారత్ అధికారులు కీలక సమావేశం.. ఏం జరుగుతోంది..??

భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే ఆ దేశంపై పలు కఠిన ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు మారాయి. అయితే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ల సమావేశం నిమిత్తం భారత బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు అంటే మూడు రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భారత్, పాకిస్థాన్‌ లతో పాటు రష్యా, చైనా, ఇరాన్, బెలారస్ సహా సభ్య దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మేరకు భారత బృందానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అలోక్ దిమ్రి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే అలోక్ దిమ్రి భారత్ తరఫున ఎస్సీఓకు నేషనల్ కో- ఆర్డినేటర్ గా ఉన్నారు.

ఇక షాంఘై సహకార సంస్థలో ప్రస్తుతం రష్యా, భారత్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, బెలారస్, చైనా సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ ఈ కూటమిలో 2017లో భాగస్వాములుగా చేరాయి. ఈ ఏడాది అధ్యక్ష పదవిని కిర్గిస్థాన్ నుంచి సెప్టెంబర్ 1 న భారత్ తీసుకుంది. వచ్చే ఏడాది ఆగస్టులో పాకిస్థాన్ లో జరిగే ఎస్సీఓ సమ్మిట్ లో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 28-30 వరకు ఎస్సీఓ కోఆర్డినేటర్ల సమావేశం జరగనుంది. ఇక వచ్చే ఏడాది నిర్వహించే ఎస్సీఓ సమావేశానికి కూటమి సభ్య దేశాలతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వాన పత్రిక పంపిస్తుందని ఇప్పటికే పాకిస్థాన్ హింట్ ఇచ్చింది.

Pakistan A key development in the Pakistani capital Islamabad India Pakistan officials hold meeting

ఇక మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో పాకిస్థాన్ సరికొత్త థీమ్ ను ఎంచుకుంది. టర్నింగ్ విజన్ ఇన్ టూ యాక్షన్.. కనెక్టివిటీ, ఇన్నోవేషన్ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ థీమ్ గా పేర్కొంది పాకిస్థాన్. ఈ థీమ్ లో భాగంగా సభ్య దేశాల విజన్ ను, ప్రాధాన్యతను ముందుకు తీసుకెళ్లడం, ఎస్సీఓలో ఆ దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తమ దేశం అన్ని కూటమి దేశాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఇక 2024 లో పాకిస్థాన్ లో జరిగిన ఇదే సమావేశానికి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరైన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+