"ఇంగ్లీష్ లో ఆలోచించి హిందీలో.."- రాహుల్ లో అతిపెద్ద లోపం కనిపెట్టిన సాయిరెడ్డి..!
లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (rahul Gandhi)పై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాహుల్ మాస్ తో ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నారో సాయిరెడ్డి వెల్లడిస్తూ ఇవాళ ఆయన ఓ ట్వీట్ చేసారు. ఇందులో రాహుల్ గాంధీ స్పీచ్ లే కారణమని సాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. రాహుల్ మనసులో ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి అని ఆయన విశ్లేషించారు. దీంతో సాయిరెడ్డి విశ్లేషణ చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ఎంపీ నుంచి విపక్ష నేత వరకూ ఎదిగిన రాహుల్ గాంధీలో ఓ లోపాన్ని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా గుర్తించారు. రాహుల్ గాంధీ మాట్లాడే హిందీ.. ఇంగ్లీషు నుండి అనువదించినట్లుగా వినిపిస్తుందని సాయిరెడ్డి విశ్లేషించారు. అలాగే అందులో వ్యావహారిక పదబంధాలు కొరవడ్డాయని తెలిపారు. ఇది భారత రాజకీయాల్లో ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని దెబ్బతీస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు.

Rahul Gandhi is a natural English speaker, but politics in India is won in the language people speak every day. His Hindi sounds translated with English words, an accent and no colloquial expressions. It feels like he’s thinking in English and speaking in Hindi, which affects…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 31, 2026
గతంలో చాలా సార్లు బీజేపీని పొగుడుతూ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ పలు ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి.. రాహుల్ గాంధీ విషయంలో ఇలా వ్యక్తిగతంగా ఎప్పుడూ ట్వీట్ పెట్టలేదు. కానీ ఇప్పుడు రాహుల్ లో లోపాన్ని గుర్తించి సాయిరెడ్డి చేసిన ట్వీట్ వెనుక కారణమేంటో తెలియదు కానీ ఈ సమస్యను విపక్ష నేత ఎలా అధిగమిస్తారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే లోక్ సభలో సైతం రాహుల్ గాంధీ కంటే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా స్పీచ్ లకు ఎక్కువ మైలేజ్ వస్తున్న తరుణంలో సాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.














Click it and Unblock the Notifications