యుద్ధ నౌకపై హెచ్చరిక లేకుండా అమెరికా చర్య.. మూల్యం చెల్లించక తప్పదన్న ఇరాన్!

ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడిలో ఇరాన్ సర్వాధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు.దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులకు దిగింది. ఈ పరిణామాల మధ్యే హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి ప్రయోగించిన టార్పెడో దాడిలో ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ డేనా యుద్ధనౌక మునిగిపోయింది.

అమెరికా దారుణ చర్యపై ఇరాన్ విదేశాంగ మంత్రి

శ్రీలంక తీరంలో ఐఆర్ఐఎస్ డేనా యుద్ధ నౌకను ముంచినట్లు అమెరికా రక్షణ విభాగం ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో, ఇరాన్ తీరానికి 2వేల మైళ్ళ దూరంలో హెచ్చరిక లేకుండా అమెరికా ఈ దారుణ చర్యకు పాల్పడింది అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి, ఈ దాడిపట్ల అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఐఆర్ఐఎస్ డేనాలో 130 మంది నావికులు, భారత నావికాదళ అతిథులు కూడా ఉన్నారని అరఘ్చి తెలిపారు.

iran israel war Iranian Foreign Minister Seyyed Abbas Araghchi warned US over IRIS Dena warship attack

విశాఖ నుండి తిరిగి వెళ్తుండగా దాడి

మొత్తంగా 180 మంది సిబ్బంది ఉండగా, శ్రీలంక నౌకాదళం 32 మందిని రక్షించింది. 87 మృతదేహాలు లభ్యం కాగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం నుంచి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా జలాంతర్గామి ఒక ఉపరితల నౌకపై దాడి చేయడం ఇదే మొదటిసారి.

భద్రతకు ముప్పు ఉందని శ్రీలంక ఎంపీ హెచ్చరిక

గల్ఫ్ యుద్ధం శ్రీలంక తీరానికి చేరడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ప్రాంతీయ దేశాలైన భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ భద్రతకు ముప్పు అని ఓ శ్రీలంక ఎంపీ హెచ్చరించారు. ఈ అంశంపై దక్షిణాసియా దేశాలన్నీ కలిసి చర్చించాలని ఆయన సూచించారు. అయితే ఈ ఘటనతో భారత నౌకాశ్రయాలను అమెరికా వినియోగిస్తుంది అన్న ప్రచారం జరుగుతుంది.

భారత్ పై దుష్ప్రచారం ఖండించిన విదేశాంగ శాఖ

దీంతో భారత విదేశాంగ శాఖ 'ఎక్స్' ఫ్యాక్ట్‌చెక్‌ ఖాతా ద్వారా ఇది తప్పుడు ప్రచారం అని తేల్చింది. ఈ తప్పుడు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లను హెచ్చరించింది. పశ్చిమాసియాలో సంయమనం పాటించాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భారత్ ఇప్పటికే అన్ని పక్షాలకు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+