తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు: టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్ గౌడ్‌

శంషాబాద్‌ లో ఆదివారం నిర్వ‌హించిన‌ టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రానికి బీసీ నేత సీఎం కావడం ఖాయమని అన్నారు. బీసీ సీఎం అభ్యర్థికి రాహుల్, ఖర్గే, రేవంత్‌ రెడ్డి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికో.. ఏ ఒక్కరికో.. లేదా ఒక ప్రాంతానికో సొంతం కాదని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వారికి దక్కాలనేదే రాహుల్ నినాదమని వివరించారు. అన్ని కులాల మద్దతుతో తమ వాటా దక్కించుకుంటాం అవసరమైతే లాక్కుంటామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ అని చెప్పుకునే మోదీ.. బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని 100 సీట్లకు తగ్గకుండా సీట్లు వస్తాయని తెలిపారు.

రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రతో ఎవరు ఎంతో వారికి అంత అనేది నినాదంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్ లను చేశామని.. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతామని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. బీసీ వంచన చేస్తున్న మోదీ.. తెలంగాణ పిలుపు కేంద్రానికి కనువిప్పు కావాలని అన్నారు. మోదీ గద్దె దిగే టైం వచ్చిందని ఆరోపించారు.

అలాగే రానున్న ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం తథ్యమని.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కులాలను పక్కనపెట్టి బీసీలు అందరూ ఏకం కావాలని వివరించారు. తాము న్యాయమైన కోరికనే కోరుతున్నామని.. మన వాటా మనకు వచ్చే వరకు పోరాడాలని ఈ మేరకు మ‌హేశ్ కుమార్‌ గౌడ్ పిలుపునిచ్చారు.

MaheshGoud A BC will definitely become the Chief Minister of Telangana TPCC President Mahesh Goud

అటు ఇదే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీల జనాభా ఎంతుందో తెలుసుకోవడం కేవలం లెక్కల కోసం కాదు వారి హక్కులు, వాటా, అవకాశాలు, అభివృద్ధికి సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఇది పునాదని అన్నారు. బీసీల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని.. కుల గణన జరగాలి.. బీసీలకు న్యాయం జరగాలి.. జనాభా ప్రాతిపదికన హక్కులు, అవకాశాలు దక్కాలని తెలిపారు. సామాజిక న్యాయం సాధించే వరకు తమ గొంతు బలంగా వినిపిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+