Janhvi kapoor: నటి జాన్వీ కపూర్ AI వీడియోపై కేసు నమోదు..

ప్రస్తుతం ఏఐ ఎంతగా జనాల్లోకి వచ్చిందో మనకు తెలిసిందే. ప్రతి చిన్న విషయాన్ని ఏఐ లో వెతుకుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఇప్పుడు సర్వ సాధారణంగా మారింది. అయితే ఏఐతో పాజిటివ్ లతో పాటు నెగిటివ్ లు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఏఐ ను విచ్చలవిడిగా అనైతికమైన పనులకు వినియోగించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సెలబ్రిటీలు.. ప్రముఖుల ఫేస్ లను మార్ఫింగ్ చేసి ఇలాంటి వికృత చేష్టలకు కొందరు పాల్పడుతున్నారు.

తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాలోని సూపర్‌ హిట్ సాంగ్‌ 'చుట్టమల్లే' కు సంబంధించిన ఏఐ మార్ఫెడ్ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ పాటలో జాన్వీ కపూర్ కనిపించిన స‌న్నివేశాల‌ను ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం పట్ల ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఏఐ ను ఉపయోగించి ఇలాంటి పనులు చేయడాన్ని నీచమైన చర్యగా ఎన్టీఆర్ అభివర్ణించారు. అలాగే ఇది అసహ్యకరమైన, రోత పుట్టించే సిగ్గుమాలిన చర్య అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీని వెనుక ఉన్న వాళ్లను ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.

JanhviKapoor Case registered over AI video of actress from the movie Devara starring NTR news now

అటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఏఐ ద్వారా మార్ఫింగ్ వీడియో సృష్టించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఏఐ మార్పింగ్ వీడియోల వెనుకున్నదెవరు..? ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌నే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్టు స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+