చికెన్ లివర్ ఫ్రై ..ఇలా తెలంగాణా స్టైల్ లో చేస్తే వదిలిపెట్టరు!
చికెన్ లివర్ ఫ్రై చాలా మంది చాలా ఇష్టంగా స్పెషల్ గా భావించి తింటారు. సరైన పద్ధతిలో శుభ్రం చేసి, సరైన మసాలాలతో దీనిని చేస్తే చికెన్ లివర్ ఫ్రై రుచిగా వస్తుంది. మరి చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూడండి
కావాల్సిన పదార్థాలు:
చికెన్ లివర్ - 500 గ్రాములు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 4-5
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పసుపు - ¼ టీ స్పూన్
కారం - 1 టీ స్పూన్
ధనియాల పొడి - 1 టీ స్పూన్
గరం మసాలా - ½ టీ స్పూన్
కరివేపాకు - కొన్ని
కొత్తిమీర - కొద్దిగా
నూనె, ఉప్పు - కావలసినంత
నిమ్మరసం - 1 టీ స్పూన్ (ఐచ్ఛికం)

తయారీ విధానం:
ముందుగా లివర్‌ను బాగా శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన లివర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెనంలో నూనె వేడి చేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలు వేసి బాగా కలపాలి.
అందులో ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసి కలపండి. లివర్ ముక్కలు మీడియం మంటపై 8-10 నిమిషాలు ఉడికించండి. లివర్ పూర్తిగా ఉడికి, నీరు ఇగిరిపోయే వరకు వేయించాలి. చివర్లో గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చెయ్యాలి. అందులో కొత్తిమీర వేసి కలపాలి. లివర్‌ను ఎక్కువసేపు ఉడికిస్తే గట్టిపడుతుంది. బాగా దీప ఫ్రై చేస్తే వెగటుగా ఉంటుంది. అందుకే సరైన సమయంలో దించేయాలి. అన్నంతో, చపాతీతో లేదా రైస్‌తో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇలా తయారు చేస్తే రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై సిద్ధం.













Click it and Unblock the Notifications
