ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ..! బ్యారికేడ్ల ధ్వంసం-అరెస్టుల పర్వం..!

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఎస్ఐఆర్ లో అక్రమాలకు కారణమైన సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఢిల్లీని ముట్టడిస్తున్నాయి. ఓవైపు ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతుండగా.. అంతే స్ధాయిలో ఢిల్లీలోనూ విపక్షాలు, విద్యార్ధి సంఘాలు నిరసనలు తీవ్రతరం చేశాయి. ఇవాళ ముఖ్యంగా ఆదివారం కావడంతో భారీ ఎత్తున తరలివచ్చిన విపక్ష పార్టీలు, విద్యార్ధులతో జంతర్ మంతర్, ఇండియా గేట్ వంటి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఆందోళనకారుల్ని అదుపుచేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

CEC రాజీనామా రచ్చ వేళ ఈసీ కీలక నిర్ణయం- 5 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు..!
CEC రాజీనామా రచ్చ వేళ ఈసీ కీలక నిర్ణయం- 5 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు..!

సీఈసీ రాజీనామా కోరుతూ గాంధీ జయంతి రోజు ఢిల్లీలో ప్రారంభమైన నిరసనలు (Delhi Protests) ఇవాళ తీవ్ర స్థాయికి చేరాయి. ముఖ్యంగా రెండు రోజులుగా పోలీసుల నిర్బంధాలు, అడ్డంకులతో ఆగ్రహంగా ఉన్న ఆందోళనకారులు ఇవాళ భారీగా తరలివచ్చారు. దీంతో ఢిల్లీలో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు బారికేడ్లను బద్దలుకొట్టడం, అదుపులోకి తీసుకున్న వారిని తీసుకువెళ్తున్న బస్సులను అడ్డుకోవడం, జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడం వంటివి చేశారు.

Delhi Sees Tense Protests Demanding CEC Gyanesh Kumar s Resignation Barricades Breached
తొలిరోజే కాక్రోచ్ లకు షాక్..! పోటీ నిరసనలు..! పోలీసులకు ఫిర్యాదులు..!
తొలిరోజే కాక్రోచ్ లకు షాక్..! పోటీ నిరసనలు..! పోలీసులకు ఫిర్యాదులు..!

ఈ నిరసనల్లో ఆప్ కార్యకర్తలు, దాని విద్యార్థి విభాగం ఏఎస్ఏపీ సభ్యులు, కాంగ్రెస్ విద్యార్ది విభాగం NSUI కార్యకర్తలు, AISF ఉద్యమకారులు, ఇతర సంస్థల సభ్యులు పాల్గొన్నారు. దీంతో సెంట్రల్ ఢిల్లీ అంతటా ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని భారీగా మోహరించారు. అయినా నిరసనకారులు ఇవేవీ లెక్కచేయకుండా రోడ్లపై హల్ చల్ చేశారు. నిరసన సందర్భంగా అదుపులోకి తీసుకున్న వారిని తీసుకువెళ్తున్న బస్సులను ఆప్ కార్యకర్తలు అడ్జుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత నిరసనకారులు బారికేడ్లను బద్దలుకొట్టి జంతర్ మంతర్ వైపు వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను ముందుకు వెళ్లకుండా ఆపేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. చివరికి ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. ఇండియా గేట్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా, ఆప్ ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే సంజీవ్ ఝాతో కార్యకర్తలు అరెస్టయ్యారు.

జ్ఞానేష్ భవితవ్యం తేల్చేయబోతున్న సుప్రీంకోర్టు..! SIRలో ఏకపక్ష నిర్ణయాలపై..!
జ్ఞానేష్ భవితవ్యం తేల్చేయబోతున్న సుప్రీంకోర్టు..! SIRలో ఏకపక్ష నిర్ణయాలపై..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+