రోడ్డెక్కిన ఠాక్రే బ్రదర్స్.. సీఈసీ రాజీనామాకు భారీ విరాట్ గర్జనతో సమరశంఖం!

దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సమరభేరి మోగించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ ఆర్థిక రాజధాని ముంబై వీధులు శని, ఆదివారాల్లో హోరెత్తిపోయాయి. నేడు ముంబైలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఇద్దరూ కలిసి ఈ భారీ నిరసన ర్యాలీకి నాయకత్వం వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

5 లక్షలకే సరికొత్త 3డీ ప్రింటెడ్ ఇల్లు! బుర్రిపాలెంలో భారీ శంకుస్థాపన
5 లక్షలకే సరికొత్త 3డీ ప్రింటెడ్ ఇల్లు! బుర్రిపాలెంలో భారీ శంకుస్థాపన

'విరాట్ గర్జన మోర్చా' పేరిట చేపట్టిన ఈ మహా నిరసన ప్రదర్శనకు విపక్షాల నుంచి భారీ స్పందన లభించింది. సౌత్ ముంబైలోని మెట్రో సినిమా ప్రాంతం నుంచి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ మోర్చాలో ఏ రాజకీయ పార్టీ జెండాలకూ అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. పాల్గొన్న నాయకులు, వేలాది మంది కార్యకర్తలు కేవలం మువ్వన్నెల జాతీయ పతాకాన్ని మాత్రమే చేతబూని నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సీపీ అగ్రనేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఉద్ధవ్, రాజ్‌లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Uddhav Thackeray And Raj Thackeray Lead Huge Protest March In Mumbai Against CEC Gyanesh Kumar Over Roll Errors

ఢిల్లీలోనూ రేగిన కాక

ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లోపించిందని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు ముప్పు వాటిల్లుతోందని ఆరోపిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోనూ నిరసనలు మిన్నంటాయి. జంతర్ మంతర్ వైపు మార్చ్ నిర్వహించేందుకు యత్నించిన సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు దాదాపు 150 మంది ప్రతిపక్ష, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా గేట్ వద్ద ధర్నా నిర్వహించి ఎన్నికల సంఘం వైఖరిని ఎండగట్టారు.

Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్- ఈ నెలలోనే- రెండే స్టాప్ లు..!
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్- ఈ నెలలోనే- రెండే స్టాప్ లు..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక నిరసనలు

ఎన్నికల వ్యవస్థపై ప్రజాస్వామ్యవాదుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, ఓటర్ల ముసాయిదా జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేర్పులు చేశారనేది ఆందోళనకారుల ప్రధాన ఆరోపణ. ముంబై, ఢిల్లీలతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రజాసంఘాలు, పౌర సమాజం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే ముంబైలోని శివాజీ పార్క్ వద్ద 'జైల్ భరో' కార్యక్రమాలు కూడా జరిగాయి. సీఈసీ తన పదవి నుంచి తప్పుకునే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+