దసరా, దీపావళి ధమాకా.. సింగరేణి, కోలిండియా ఉద్యోగులకు రూ.1.10లక్షల బోనస్!

దేశంలోని బొగ్గు గనులలో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు శుభవార్త . పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ గా కోల్ ఇండియా, సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రూ.1,10,250 చెల్లించాలని జేబీసీసీఐ అపెక్స్ సమావేశం నిర్ణయించింది. శనివారం కోల్‌కతాలో జరిగిన ఈ సమావేశంలో కోలిండియా, సింగరేణి యాజమాన్యాలు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ఈ తీర్మానం చేశారు.

గతేడాది పీఎల్‌ఆర్ బోనస్‌గా రూ.1,03,000 చెల్లించగా, ఈసారి రూ.7,250 పెంచి రూ.1,10,250గా ఖరారు చేశారు. కోలిండియా కార్మికులకు దసరా సందర్భంగా ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. ఇక సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళి పండుగకు ముందు అందించనున్నారు. ఈ విషయం సింగరేణి కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలలో సంతోషం నింపుతుంది. పీఎల్‌ఆర్ అనేది సాధారణ బోనస్ కాదు. సంస్థ ఉత్పాదకత, లాభాలు, కార్మికుల పనితీరును బట్టి ఇచ్చే ప్రోత్సాహక భత్యం.

singareni workers dasara diwali gift Singareni and Coal India Workers Get Rs 1 10 Lakh PLR Bonus

బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారు. అక్కడ వారి పని పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అలాంటి కార్మికులకు ఏడాది పాటు చేసిన కృషికి గుర్తింపుగా ఈ మొత్తం అందడం వారికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ పరిధిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ బోనస్ అందడం వల్ల కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా కాస్త ఉపశమనం లభిస్తుంది.

పండుగ ఖర్చులు, పిల్లల బట్టలు, ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. గత కొన్నేళ్లుగా పీఎల్‌ఆర్ మొత్తం క్రమంగా పెరుగుతూ రావడం కార్మికులకు మరింత ఊరటనిస్తోంది. యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సానుకూల చర్చల ద్వారా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కార్మికులు ఈ బోనస్‌ను సకాలంలో అందుకునేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.

కేబీఆర్ పార్కు ప్రాజెక్టు రద్దు.. రూ.1,090 కోట్లు మిగిల్చిన చిన్న ప్లాన్!
కేబీఆర్ పార్కు ప్రాజెక్టు రద్దు.. రూ.1,090 కోట్లు మిగిల్చిన చిన్న ప్లాన్!

ఏది ఏమైనా బొగ్గు గనుల్లో పని చేసేవారి సంక్షేమం కోసం, ఆర్ధిక భద్రత కోసం కోల్ ఇండియా, సింగరేణి తీసుకున్న ఈ నిర్ణయం, వారి కష్టాన్ని గుర్తిస్తూ ఈ డబ్బు ఇవ్వాలని నిర్ణయించటం కార్మికుల కళ్ళలో వెలుగులు నింపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+