Omar Abdullah: ఒమర్ అబ్దుల్లా విడాకులపై సుప్రీం కీలక తీర్పు..!

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) విడాకులపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ప్రకటించింది. 17 ఏళ్లుగా భార్య పాయల్ తో దూరంగా ఉంటున్న ఆయన వైవాహిక జీవితానికి దీంతో శుభం కార్డు పడింది. కొన్నేళ్లుగా ఒమర్, పాయల్ ఇద్దరూ దూరంగా ఉండటమే కాకుండా పరస్పరం కేసులు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. దీంతో ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపారు.

విద్యార్ధులపై పెల్లెట్ల ప్రయోగంపై కేంద్రానికి సుప్రీం షాక్- ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశం..!
విద్యార్ధులపై పెల్లెట్ల ప్రయోగంపై కేంద్రానికి సుప్రీం షాక్- ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశం..!

ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లాకూ, ఆయన భార్య పాయల్‌లకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఇవాళ ప్రకటించింది. తమ వివాహ బంధాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకుని, పెండింగ్‌లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి అంగీకరించినట్లు ఇరువురూ కోర్టుకు చెప్పడంతో ఈ తీర్పు వెలువడింది. గతంలో తమ వివాహాన్ని రద్దు చేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంలో విచారణ సందర్భంగా ఒమర్, పాయల్ పరస్పర అంగీకారంతో తమ పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సంయుక్తంగా దరఖాస్తు దాఖలు చేశారు. అలాగే పరస్పరం దాఖలు చేసుకున్న అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా అంగీకరించారు.

Supreme Court Grants Omar Abdullah Divorce After 17 Years Of Separation
ఎమ్మెల్యే కాకుండానే 6 నెలలకు పైగా మంత్రి పదవిలో.. ! సుప్రీం ఆశ్చర్యం..!
ఎమ్మెల్యే కాకుండానే 6 నెలలకు పైగా మంత్రి పదవిలో.. ! సుప్రీం ఆశ్చర్యం..!

1994లో ఢిల్లీలోని 'ది ఒబెరాయ్' హోటల్‌లో పనిచేస్తున్నప్పుడు కలుసుకున్న ఒమర్, పాయల్ పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వారికి జహీర్, జమీర్ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో 2009 నుండి విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఒమర్ 2011లో పాయల్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగి ఢిల్లీ హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు సుప్రీం విడాకులు మంజూరు చేయడంతో కథ సుఖాంతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+